వైరల్ : పెరుగు కొనేందుకు రైలు ఆపేసిన లోకో పైలెట్.. చివరికి?

praveen
సాధారణంగా రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలు దేరింది అంటే చాలు మరో స్టేషన్ వచ్చేంత వరకు కూడా రైలు ఆగదు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ముందు నుంచి  రైల్వే అధికారులు సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే రైల్ ఆగుతూ ఉంటుంది. అయితే సినిమాల్లో చూసుకుంటే కొన్ని కొన్ని సార్లు ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. రైల్లో ప్రయాణిస్తున్న వారు చిన్నచిన్న అవసరాలకు రైళ్లు ఆపటం ఇక అవసరాలు తీర్చుకుని మళ్లీ రైలు మొదలు పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు అయ్య బాబోయ్ అంటూ అందరూ నవ్వు కుంటూ ఉంటారు. కానీ నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం అందరూ షాక్ అవుతూ ఉంటారు.

 సాధారణంగా రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు ట్రైన్లో చైన్ లాగి రైలును ఆపే యడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఏదైనా అత్యవసరం ఏర్పడినప్పుడు ఇలా ట్రైన్లో ఉన్న చైన్ లాగి రైలును ఆపాలని అటు లోకో పైలెట్ కు సిగ్నల్ ఇస్తూ ఉంటారు. దీంతో లోకో పైలెట్ ట్రైన్ ఆపేస్తూ ఉంటాడు. ఇది సాధారణంగా జరిగేది. కానీ లోకో పైలెట్  ఉద్దేశపూర్వకంగా ట్రైన్ ఆపడం అంటే కేవలం సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక లోకో పైలెట్ మాత్రం చిన్న కారణానికి ఏకంగా రైలు ఆపేసాడు. ఏకంగా ఒక దుకాణం వద్ద కు రైలు చేరుకోగానే రైలును పెరుగు తీసుకోవడానికి రైలు ఆపేసాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్గా  మారిపోయింది.

 పాకిస్థాన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక లోకో పైలెట్ చేసిన పని చివరికి అతన్ని సస్పెండ్ చేసింది. కాగా రైల్వే స్టేషన్ సమీపంలో పెరుగు కొనేందుకు ఏకంగా లోకో పైలెట్ రైలును ఆపేశాడు.  ఇక ఆ తర్వాత రైలు ఇంజన్ నుంచి దిగి దుకాణం లోకి వెళ్లి పెరుగు కొనుక్కొని వచ్చాడు. ఆ తర్వాత ఎప్పటిలాగానే మళ్ళీ రైల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాడు. దీనికి సంబంధించిన వీడియోను అక్కడ ఉన్న స్థానికులు ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. దీనిని గమనించిన పాకిస్తాన్ రైల్వే శాఖ లోకో పైలట్, అసిస్టెంట్ ను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: