మొబైల్ బ్లాస్టింగ్.. చార్జింగ్ పెట్టేముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి?
నేటి దైనందిత జీవితంలో స్మార్ట్ ఫోన్ వాడకం అనేది తప్పనిసరి అయిపోయింది. ఫోన్ వాడడం తప్పు కాదుగానీ, ఎలా వాడాలో తెలుసుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు జనాలు చాలా నిర్లక్ష వైఖరిని అవలంబిస్తారు. దాంతోనే చాలాచోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ పెళ్లి ఏకంగా చనిపోయిన ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ముఖ్యంగా మొబైల్ ఛార్జ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ప్రతిరోజూ ఇలాంటి తప్పులు చేస్తుంటారు. మీరు అస్సలు చేయవద్దు.
చేతులు పదనుగా ఉన్నప్పుడ ఫోన్‌ను అస్సలు ఛార్జ్ చేయకండి. ఎల్లప్పుడూ ఫోన్ ఒరిజినల్ ఛార్జర్‌ని మాత్రమే మీ ఫోన్ కి వాడితే ఉత్తమం. తరచుగా చాలా మంది ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి అందుబాటులో ఉన్న మరేదైనా ఛార్జర్‌ని ఉపయోగిస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఆ సందర్భంలో, ఛార్జర్‌లో షార్ట్ సర్క్యూట్ ఉండవచ్చు. తద్వారా... ఫోన్ వేడిక్కి, పేలవచ్చు. ఇక రాత్రిపూట ఫోన్‌ను అస్సలు ఛార్జ్‌లో పెట్టి మర్చిపోవద్దు. కొంతమంది నిద్రపోయే ముందు ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టి నిద్రపోతారు. ఇది అస్సలు మంచి అలవాటు కాదు. కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్‌ను ఛార్జ్ చేయండి.
అదేవిధంగా మీ మొబైల్ డేటా అయిపోతే, మీరు చేయవలసిన మొదటి పని మొబైల్ డేటాను ఆఫ్ చేయడం. అవును, ఇది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఫోన్ నెట్ సరిగ్గా పని చేయనప్పుడు, దాన్ని ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి. ఇది మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ని రీసెట్ చేయడంలో మీకు ఉపకరిస్తుంది. అదేవిధంగా ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ మరియు ఆఫ్ చేయండి. ఇది నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచగలదు. కొన్నిసార్లు పరికరాన్ని ఆఫ్ చేయడం మరియు ఆన్ చేయడం కూడా నెట్‌వర్క్ సమస్యలను పరిష్కరించవచ్చు. ఒకసారి ఫోన్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేస్తే కనెక్షన్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. తద్వారా నెట్వర్క్ సమస్యలు మెరుగుపడతాయి. మీ మొబైల్ 80 శాతం ఛార్జ్ అయిపోగానే తీసివేయండి. అదే సమయంలో 30 శాతానికి ఛార్జ్ తగ్గగానే ఛార్జ్ చేయడం ఎంతో ఉత్తమం. ఇలాంటి సలహాలు, సూచనలు పాటించడం ద్వారా ఫోన్ బేటరీ లైఫ్ పెరగడంతో పాటు, ఫోన్ హీట్ తప్పకుండా తగ్గుతుంది.