బుల్లి పిట్ట: గీజర్ ఉపయోగిస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే పేలడం ఖాయమే..!

Divya
ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఉన్నారు. చలికాలం వచ్చిందంటే చాలు చాలామంది వేడి నీళ్లు పోసుకోవడానికి ఎలక్ట్రిక్ గీజర్లని ఉపయోగిస్తూ ఉన్నారు. మరి కొంతమంది గ్యాస్ గీజర్లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలా ఎలక్ట్రిక్ గ్రీజర్ ఉపయోగించేటప్పుడు కొన్ని తప్పులు చేస్తే చాలా ప్రమాదాలకు కారణమవుతున్నాయట.ముఖ్యంగా పేలుళ్లు కూడా జరుగుతున్నాయని పలువురు టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ముఖ్యంగా గీజర్ ని నిరంతరం రన్ చేస్తూ లేదా ఆఫ్ చేయడం మర్చిపోవడం వల్ల చాలా ప్రమాదం జరుగుతుందట. ఎక్కువ వేడి ఎక్కడం వల్ల పేలుడుకు కారణం అవుతుందని తెలియజేస్తున్నారు. గీజర్ ధర్మామీటర్ కరెక్ట్ గా పని చేస్తుందో లేదో చెక్ చేస్తూ ఉండాలి.

గీజర్ లోపల ఒత్తిడి పెంచడానికి సేఫ్టీ వాళ్ళు అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. అందుకే వీటిని తరచూ చెక్ చేస్తూ ఉండాలి. గీజర్ లోపల ఒత్తిడి ఎక్కువగా గురైనప్పుడే పేలే అవకాశం ఉంటుందట.

గీజర్ ని ఎక్కువకాలం వాడకుండా అలాగే ఉంచకూడదు. కనీసం వారంలో ఒక్కసారైనా వాటిని ఉపయోగిస్తూ ఉండాలి. గీజర్ పాతది అయినా లేదా ఏదైనా ఇబ్బందులు తలెత్తిన రిపేరు చేయించడం కంటే కొత్తది తీసుకోవడం ఉత్తమమట. ముఖ్యంగా ధర్మోస్ స్టార్ట్ సమస్య ఉంటే చాలా ప్రమాదం ఎదురవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

గీజర్ ని ఉపయోగించేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తూ ఉండాలి.. ఎందుకంటే గీజర్ నుండి నీరు లీకైన లేదా వేడెక్కడం వంటి సమస్యలు ఎదురైతే విద్యుత్ షాక్ కు గురవుతారు. దీనివల్ల మనిషికి కూడా చాలా ప్రమాదం ఎదురవుతుంది. గీజర్ ని ఎప్పుడు కూడా కాస్త గాలి ఆడే ప్రదేశంలో ఉంచడం ఉత్తమం. దీనివల్ల గీజర్ ఎక్కువగా వేడి అవ్వకుండా ఉంటుంది. కరెంటు ఎత్తుతగ్గులు వచ్చినప్పుడు కూడా గీజర్ ని ఉపయోగించకపోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: