బుల్లి పిట్ట: మీ మొబైల్లో ఈ యాప్స్ ఉంటే.. డబ్బులు అన్ని మాయం..!

Divya
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ మొబైల్, ట్యాబ్ ఇతరత్రా వాడకాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇవి లేకపోతే ప్రస్తుతం పనులేవి జరిగేలా కనిపించడం లేదు. ఇదే అదునగా తీసుకొని హ్యాకర్లు కూడా రోజురోజుకీ యూజర్స్ మీద విజృంభిస్తూ ఉన్నారు. కొన్ని లింకులను పంపించి యూజర్స్ కి తెలియకుండానే చాలామంది దగ్గర నుంచి డేటాని తీసుకొని అకౌంట్లో డబ్బుని కొట్టేస్తున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడింగ్ యూజర్ లని టార్గెట్ చేస్తూ ఉన్నారు హ్యాకర్స్. అన్ అఫీషియల్ గా ఉన్న కొన్ని యాప్స్ గేమ్లను డౌన్లోడ్ చేయడం వల్ల ఇది వైరస్ గా మొబైల్ లోకి వస్తుందట.

మరి కొంతమంది గూగుల్ ప్లే స్టోర్, లేదా గూగుల్ నుంచి కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ని సైతం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా యాప్స్ ఉపయోగించడం చాలా ప్రమాదమని దీనివల్ల మీ డేటా మొత్తం ఇతరులు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి యాప్స్ ల వల్లే నెక్రో ట్రోజన్ వైరస్ వ్యాపింప చేసేలా చేస్తున్నారట. ఈ వైరస్ వల్ల మీ మొబైల్ లో కొన్ని అన్ వాంటెడ్ యాడ్స్ ని కూడా వస్తూ ఉంటాయట  . కేవలం రెండు యాప్స్ వల్ల ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు టెక్నిపుణులు తెలుపుతున్నారు.

అందులో ఒకటి వూటా కెమెరా (VUTA CAMERA), మరొకటి మ్యాక్స్ బౌజర్ (MAX BROWSER) వంటి యాప్స్ చాలా ప్రమాదకరమని ఈ రెండు ఉంటే కచ్చితంగా ఎవరైనా అన్ ఇన్స్టాల్ చేయడం మంచిదట. ఎందుకంటే ఈ రెండు యాప్స్ వల్లే చాలా వైరస్ ని ఈజీగా స్ప్రెడ్ చేస్తున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. వూటా కెమెరా అనే యాప్ ని రెండు కోట్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకుంటున్నారట.మ్యాక్స్ బ్రౌజర్ అనేది సుమారుగా 4 లక్షల మందికి పైగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అందుకే ఎవరైనా మొబైల్లో ఉంటే వీటిని డిలీట్ చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: