బుల్లి పిట్ట: మీ ఇంటికి ఏసీ ఉందా..భారీ జరిమానా పడుద్ది..!

Divya
వేసవికాలం వస్తుందంటే చాలు చాలామంది ఎండలకు భయపడి ప్రతి ఒక్కరు ఏసీలు, కూలర్లు వంటివి ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఈ ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా ఏసీలను ఉపయోగిస్తూ ఉండడంతో వీటి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు కూడా మీ ఇంటికి AC బిగించుకోవాలనుకుంటే.. ఇంట్లో ఉండే విద్యుత్ వాట్లపైన ఆధారపడి ఉంటుందట. ముఖ్యంగా ఏసిని ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత విద్యుత్ వాట్స్ ఉండాలి వాటి యొక్క నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం.

ఎవరైనా ఇంటికి కొత్త ఏసీని కొనుగోలు చేస్తున్నట్లు అయితే ఒక విషయాన్ని గుర్తించుకోవాలి.. ఇంటికి విండో ఏసీ లేదా స్ప్లిట్ ఏసిని బిగించుకున్న వారు కచ్చితంగా విద్యుత్ శాఖ నుంచి కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఆ పరిమిషన్ లేకపోతే ఇబ్బందులలో పడడమే కాకుండా భారీగా జరిమానాలను కూడా చెల్లించాల్సి ఉంటుందట. ఒక వ్యక్తి తన ఇంట్లో ఏసీని ఇన్స్టాల్ చేయాలి అంటే.. కనీసం 3 KW మీటర్ ను ఆ ఇంటికి అమర్చుకోవాలి. సాధారణ మీటర్ కి ప్రస్తుతం మనం కూలర్లు, ఏసీ వంటివి ఉపయోగించడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దీనివల్ల కొన్నిసార్లు ఓవర్ లోడింగ్ కూడా అవుతుందట.
ఎవరైనా విద్యుత్ ను ఆదా చేసుకోవడానికి విద్యుత్తును దొంగలించడం వంటివి చేస్తే కచ్చితంగా వారికి జరిమానా ఉంటుంది.. ఒక వ్యక్తి ఇంటికి 1.5 టన్ను వరకు ఏసీ ని బిగించుకోవాలి అంటే 3kw కనెక్షన్ ఉండాలి..2 టన్నుల  ఏసీ బిగించుకోవాలంటే కచ్చితంగా 5kw కనెక్షన్ ఉండాలి..

ఇలా ఎవరైనా మీటర్ను మార్చుకోకపోతే విద్యుత్ అధికారులు జరిమానాన్ని వేస్తారట. చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా 1-1.5 kw మీటర్లు ఉంటాయి.. ఇలాంటి సమయంలో మన ఏసీ ని బిగించినట్లు అయితే 1.5 మించి లోడ్ ని తీసుకోలేదు. దీనివల్ల డామేజ్ కావడమే కాకుండా అధికారులు తనిఖీ చేసినప్పుడు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అందుకే మనం 3kw మీటర్లు కు అప్లై చేసుకోవాలి. ఎవరైతే తక్కువ వాట్స్ మీటర్ నుండి ఎక్కువ వినియోగిస్తారు వారికి మాత్రమే జరిమానా ప్రభుత్వం విధిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: