బుల్లి పిట్ట: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. కేవలం రూ.37 వెలకే లాంచ్..!!

frame బుల్లి పిట్ట: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. కేవలం రూ.37 వెలకే లాంచ్..!!

Divya
ఇండియాలో ఎక్కువగా ఎలక్ట్రిక్ మార్కెటింగ్ రంగం రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే పలు రకాల టాప్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను సైతం తీసుకువస్తున్నాయి. తాజాగా  నోయిడాకు చెందినటువంటి మెబిలిటీ కంపెనీ.. నుండి నెక్స్ జన్ ఎనర్జీయా అనే ఎలక్ట్రిక్ బైక్ ని ఈ వారం లాంచ్ చేసింది.. అయితే దీని ధర కేవలం రూ .37 వేల రూపాయల నుంచే ప్రారంభంతో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేశారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ను ప్రముఖ వ్యాపారవేత్త నటుడు సునీల్ శెట్టి ఆవిష్కరించారు.

ఇండియాలో ఉండేటువంటి మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసుకొని ఈ ఎలక్ట్రిక్ నేక్సాజన్ బైక్ ని విడుదల చేశామంటూ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్ కు సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. రాబోయే తరానికి ఎలక్ట్రిక్ వాహనాలు మరింత అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యం అంటూ నెక్స్ జన్ బ్రాండ్ అధినేతలు తెలియజేస్తున్నారు. నెక్స్ జన్ బ్రాండెడ్ చైర్మన్ పీయూష్ ద్వివేది మాట్లాడుతూ ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలతో ఆహ్లాదకరాన్ని మార్చడంతో పాటు శుభ్రమైన భవిష్యత్తును అందించడమే తమ లక్ష్యం అంటూ వెల్లడించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ .500 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలు దాటాలని తమ కంపెనీ ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని తెలిపారు. 50వేల మందికి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడం మా లక్ష్యంగా పెట్టుకున్నామంటూ నెక్స్ జెన్  అధినేత తెలిపారు. వచ్చే ఏడాది అత్యంత సరసమైన ధరలకే ఎలక్ట్రిక్ కార్ ను కూడా విడుదల చేయ బోతున్నామని దీని ధర  రూ.5 లక్షల లోపే ఉంటుందని వెల్లడించారు. సామాన్య ప్రజలే తమ టార్గెట్ అనుకొని తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్ లను వాహనాలను కూడా తయారు చేస్తున్నామంటూ వెల్లడించారు. మరి ఈ వాహనాలు సామాన్య ప్రజలకు ఉపయోగపడతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: