బుల్లి పిట్ట: ఐఫోన్ యూజర్స్ కి షాక్.. స్మార్ట్ ఫోన్ పింకీ వస్తోంది..!!

Divya
మనలో చాలామంది అతిగా స్మార్ట్ మొబైల్స్ ని సైతం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.. ఇలాంటివారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ పింక్ వచ్చేస్తోందని తెలుపుతున్నారు. స్మార్ట్ మొబైల్ యూజర్స్ కి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తోందని ముఖ్యంగా ఐఫోన్ వాడేటువంటి యూజర్స్ కి ఈ సమస్య ఎక్కువగా బయటపడుతోందని తెలుపుతున్నారు. అయితే ఈ ప్రచారం యాపిల్ కంపెనీ మాత్రం ఖండిస్తోంది. ఇదంతా కేవలం దుష్ప్రచారం వల్లే చేస్తున్నారంటూ తెలియజేస్తున్నారు.

పింకీ ఫింగర్ అంటే చిటికెన వేలు స్మార్ట్ మొబైల్ వాడకం వల్ల చిటికెన వేలు నిర్మాణ స్వరూపం చాలా దెబ్బతింటుందని దాని సేపు కూడా మారిపోతుందని ఈ సమస్యను స్మార్ట్ ఫోన్ పింక్ అని పిలుస్తున్నారని తెలుస్తోంది. మనం స్మార్ట్ మొబైల్ సపోర్టుగా చిటికెన వేలును అడ్డుపెట్టుకొని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము.. దీనివల్ల ఆ వేలు కూడా వంగడం ప్రారంభమవుతుంది. ఫలితంగా అసౌకర్యంగా ఉండడమే కాకుండా నొప్పి వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందట. అయితే మొబైల్ ని ఎక్కువసేపు ఈ ఒక్క భంగిమలో ఉంచడం వల్ల ఇలాంటి ప్రాబ్లంస్ ఎదురవుతున్నాయని తెలుపుతున్నారు.

అందుకే వైద్యులు సైతం కొన్ని హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ఎక్కువ సమయం ఫోన్లలో టెక్స్ట్ చేయడం కానీ మొబైల్ ని ఎక్కువగా పట్టుకొని ఉండడం కానీ చేయకూడదని.. టెక్స్ట్ మెసేజ్లు చేసేవారు ఎక్కువగా మోచేతిని 90 డిగ్రీలలో ఉంచడం మంచిదని తెలుపుతున్నారు. అంతేకాకుండా స్మార్ట్ మొబైల్ లో ఉండే ఎల్బో అనే సిండ్రోమ్ వల్ల కూడా ఈ చిటికెన వేలు పైన చాలా భారం పడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ చిటికెన వేలికి ఎక్కువగా తిమ్మిరి వంటివి అనిపించడం దీనివల్ల నరాలు దెబ్బ తినడం వల్ల చాలా రిస్క్ ఉంటుందని వైద్యులు సైతం వార్నింగ్ ఇస్తున్నారు. దీనివల్ల ఫింగర్ చాలా డిఫరెంట్ గా ఏర్పడుతుందని తెలుపుతున్నారు. అలాగే బొటనవేలు,టెక్స్టింగ్ టైప్ ,మెడ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: