బుల్లి పిట్ట: చౌక ధరకే అత్యధికంగా మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్..!!
మార్కెటింగ్ ఫీల్డ్ లో పని చేసేవారు కచ్చితంగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే ద్విచక్ర వాహనాలని కొనుగోలు చేస్తూ ఉంటారు.అలా మన ఇండియాలో ఉన్న బైకులలో ఏది అత్యధికంగా మైలేజ్ ఇస్తుందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.
1). హీరో స్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్:
హీరో బ్రాండ్ నుంచి వచ్చిన ఈ బైక్ ప్రస్తుతం ధర రూ.79,911 రూపాయలు ఎక్స్ షోరూం కలదు.. ఈ బండి ఇంజన్ సామర్థ్యం 97.2CC కలదు.. 8 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది.. ఈ బైక్ లీటర్ కి 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందట.
2).TVS రైడర్:
టీవీఎస్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ బైక్ ధర.. రూ.95,000 నుంచి రూ.1.03 లక్షల ధరలు ఉంటుంది దీని బైక్ ఇంజన్ 124.8 CC కలదు.11NM టార్కును కూడా ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే లీటర్కు 67 కిలోమీటర్లు ఇస్తుందట.
3). హీరో హెచ్ఎఫ్ డీలక్స్:
హీరో బ్రాండ్ నుంచి వచ్చిన ఈ బైక్ ధర రూ.59,998 నుంచి 70 వేల లోపు ఉంటుంది దీని ఇంజన్ సామర్థ్యం..97.2CC కలదు.8NM టార్కున్ సైతం ఉత్పత్తి చేస్తుంది ఈ బైక్ లీటర్ కి 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
4). బజాజ్ పల్సర్-125:
బజాజ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ పల్సర్ బైక్ ఎక్స్ షోరూం ధర రూ 99,571 రూపాయలు కలదు.దీని ఇంజన్ సామర్థ్యం 124.45 CC కల.. ఈ బైక్ లీటర్ కి 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
ఐతే ప్రాంతాన్ని బట్టి ధరలలో కాస్త వ్యత్యాసం ఉంటుంది..