బీరు బాటిల్స్ గ్రీన్ కలర్ లో ఉండడం వెనక.. ఇంత సైంటిఫిక్ రీజన్ ఉందా?
అంతలా ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో ఇక ఎండవేడికి చల్ల చల్లని బీరు తాగితే ఏకంగా అమృతం కంటే బాగుంటుంది అని ఎంతోమంది బీరు ప్రియులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఎంతలా పెరిగిపోతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ బీరు సీసాలు గ్రీన్ లేదా గోధుమ రంగులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే బీర్ సీసాలకు కేవలం ఈ రెండు కలర్స్ మాత్రమే ఎందుకు ఉంటాయి అని ఎప్పుడైనా గమనించారా?
అయితే చాలా ఏళ్ల కిందట బీరును పారదర్శక సీసాలలో స్టోర్ చేసేవారట. అవి సూర్యరశ్మికి గురైనప్పుడు యువీ కిరణాలు బీర్ లోపల ఉన్న రసాయనాలని వేగంగా మార్చడాన్ని నిపుణులు గమనించారు. దానివలన బీర్ టెస్ట్ మారిపోయిందట. దీంతో వారు బీర్ను సూర్య రష్మీ నుంచి కాపాడడానికి కాంతిని చెదరగొట్టే వివిధ రంగులతో సీసాలను తయారు చేశారు. ఇలాంటి సమయంలోనే గ్రీన్, బ్రౌన్ కలర్ లో తయారు చేసిన సీసాల లోపలికి సూర్యరశ్మి ప్రవేశించలేక పోయిందట. కాగా మొదట బ్రౌన్ కలర్ బీర్ సీసాను తయారుచేసి అందులో బీరు స్టోర్ చేయడం మొదలు పెట్టారట. ఇక ఆ తర్వాత కాలంలో గ్రీన్ కలర్ సీసాలలో కూడా బీర్ ని స్టోర్ చేయడం మొదలు పెట్టారట. ఇక ఈ రెండు కలర్స్ కి ఎక్కువ రెస్పాన్స్ రావడంతో అప్పటినుంచి ఈ రెండు కలర్స్ ఉన్న బీరు సీసాలలోనే బీరు పోసి స్టోర్ చేస్తూ ఉన్నారట.