బుల్లి పిట్ట: ఆధార్ కార్డు విషయంలో ఎప్పటికీ చేయకూడని తప్పులు ఇవే..!!
ప్రజలు ఆధార్ కార్డు నెంబర్ ఇస్తున్నప్పుడు చేయకూడని పనులు ఒకసారి చూద్దాం.. ఆధార్ నెంబర్ అనేది కచ్చితంగా 12 అంకెలు కలిగి ఉంటుంది. దీనిని ప్రభుత్వం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అందిస్తుంది. మీరు ఎవరికైనా ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేటప్పుడు చట్టపరమైన అవసరాలకు అనుగుణంగానే నిర్వహించే సంస్థలకు మాత్రమే ఇవ్వాలని ఆధార్ చట్టం నిబంధనలు కూడా ఇవే చెబుతున్నాయి. ఆధార్ కార్డ్ ఇచ్చేటప్పుడు అది ఏ ప్రయోజనం కోసం ఇస్తున్నారు ఆ సంస్థ కూడా తెలియజేయాలి.
ఒకవేళ మీరు ఆధార్ కార్డు నెంబర్ షేర్ చేయడం ఇష్టం లేకపోతే..m-aadhaar ను ఎంచుకోవడం మంచిది.మీ ఆధార్ కార్డ్ అతెంటికేషన్ హిస్టరీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి కచ్చితంగా చెక్ చేసుకోవడం మంచిది. మీ ఈమెయిల్ ఐడి ని ఆధార్ కార్డుకి లింక్ చేయడం మంచిది. అలాగే ఓటీపీ వచ్చేందుకు మీ ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ ని లింక్ చేయాలి. మీరు ఆధార్ కార్డు ఉపయోగించని సమయంలో ఆధార్ బయోమెట్రిక్ లాకింగ్ ఫీచర్ ని ఉపయోగించడం మంచిది. దీన్ని ఉపయోగించడం వల్ల ఎవరు ఎలాంటి ఫ్రాడ్ చేయలేరు.. మీ ఆధార్ కార్డు ఎక్కడైనా దుర్వినియోగంగా అనిపించినట్టు సంకేతాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1947 కి కాల్ చేయడం లేదా help@uidai.gov.in ఈమెయిల్ చేయాలి. మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఎప్పుడు కూడా ఎక్కడపడితే అక్కడ ఇవ్వకూడదు. ఇలాంటి విషయాలు ఆధార్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలి