ఓలా నుంచి అదిరిపోయే సూపర్ బైక్?
అలాగే మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మోటోజీపీ భారత్ కి పార్టనర్ గా వ్యవహరిస్తోంది. ఓలా కంపెనీ మొత్తం 150 ఎలక్ట్రిక్ స్కూటర్లను ట్రాక్ చుట్టూ మొబిలీటీ డ్యూటీ కోసం ఉంచారు. ఇవి మార్షల్ సపోర్ట్ తో ఉంచారు.ఇక ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం మూవ్ ఓఎస్4 బీటా వెర్షన్ ని పరీక్షిస్తోంది. దీన్ని ఎంచుకున్న కస్టమర్లకు కోసం బీటా రోల్ అవుట్ అనేది ప్రారంభమైంది.అలాగే స్టాండర్డ్ వెర్షన్ వినియోగదారులందరికీ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇక మూవ్ ఓఎస్4తో ఓలా దాని సొంత మ్యాప్ లను జోడిస్తోంది. వీటిని ఓలా మ్యాప్స్ అని అంటారు. రీజనరేషన్, హిల్ హోల్డ్, చార్జింగ్ టైం ప్రిడిక్షన్, చార్జింగ్ ఇంకా రైడింగ్ రేంజ్ వంటి మెరుగైన ఫీచర్లు తమ వద్ద ఉన్నాయని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. అలాగే హైపర్ చార్జింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో డాక్యూమెంట్ సిన్సింగ్, కాంటాక్ట్ సిస్సింగ్, పైరింగ్ ఇంకా టచ్ రెస్పాన్స్ చాలా వేగంగా జరుగుతుంది.