
కళ్ళజోడు ఫ్రిడ్జ్ లో పెడితే.. ఏం జరుగుతుందో తెలుసా?
కానీ ఇప్పుడు చదువు ఉన్న లేకపోయినా పర్వాలేదు. కానీ కాస్త క్రియేటివిటీ ఉంది అంటే చాలు వాళ్లే తోపులు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో తమ క్రియేటివిటీని నిరూపించుకొని తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించి ఉద్యోగంలో వచ్చే జీతం కంటే ఎక్కువగానే సంపాదిస్తున్న వారు నేటి రోజుల్లో చాలానే కనిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేసి ఆ వీడియోలను యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.
ఇప్పుడు మనం మాట్లాడుబోయే వీడియో ఇలాంటి కొవలోకి చెందినదే. సాదరణంగా ఎంతో మంది కూరగాయలు ఐస్ క్రీమ్ అంటూ చాలా రకాల వస్తువులు ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. కానీ కళ్ళకు పెట్టుకునే అద్దాలు ఫ్రిజ్లో పెడితే ఏమవుతుంది. ఇలా ఎప్పుడైనా ఆలోచించి ప్రయత్నించారా ఒకవేళ ప్రయత్నించకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకుందాం.. కళ్ళకు పెట్టే అద్దాలను ఫ్రీజర్ లో పెట్టింది మహిళ. ఆ తర్వాత 15 నిమిషాలకి ఆ కళ్లద్దాలను ఫ్రిజ్ నుండి బయటకు తీసింది. చూస్తే గ్లాసుల మీద ఆవిరి కళ్ళజోడు తుడవడానికి ఉపయోగించే ఒక గుడ్డతో తుడిచింది. అయితే అక్కడ ఇక్కడ పెట్టడం వల్ల కళ్ళద్దాలపై మచ్చలు గీతలు పడతాయి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఇక ఆ కళ్ళద్దాలపై ఉన్న ఆవిరి తుడిస్తే మాత్రం గీతలు మొత్తం మాయం అయ్యాయి కొత్త దానిలా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియో చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు.