బుల్లి పిట్ట : రూ.15 వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!

frame బుల్లి పిట్ట : రూ.15 వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!

Divya
ప్రస్తుతం భారత మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆకర్షణీయమైన ఫీచర్లతో అనేక స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 5g స్మార్ట్ ఫోన్లను ప్రతి ఒక్కరు వినియోగిస్తున్న నేపథ్యంలో బడ్జెట్లో లభించే రూ.15 వేల లోపు స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.
రెడ్మీ 12 5G:
ఈ ఫోన్ అనేది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఇక ఈ ఫోన్ ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీని ధర కేవలం రూ.10,999.. రెడ్మీ 12 5g అనేది భారత మార్కెట్లో సరికొత్త స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్ సెట్ తో వచ్చిన మొదటి ఫోన్ కావడం గమనార్హం. ఇందులో కాల్ , టెక్స్ట్ , సోషల్ మీడియా, బ్రౌజింగ్ ,లైట్ వంటి రోజు వారీ పనులను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.

సాంసంగ్ గెలాక్సీ M14 5G:
బ్యాంక్ ఆఫర్లతో పని లేకుండా బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ను ఈ స్మార్ట్ ఫోన్ అందిస్తుంది. ప్రత్యేక ఫీచర్లలో ఇదొకటి అని చెప్పవచ్చు. 90Hz LCD డిస్ప్లే స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్ ను కూడా ఈ స్మార్ట్ ఫోన్ అందిస్తుంది. Exynos 1330 చిప్ తో డివైస్ బ్యాటరీ, పర్ఫామెన్స్ ప్రాసెసింగ్ ని కూడా అందిస్తుంది. రూ .15 వేల కంటే తక్కువ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ లభించడమే కాదు ప్రత్యేకమైన ఫీచర్లతో కూడా అలరిస్తోందని చెప్పవచ్చు.

రియల్ మీ నార్జో N53 5g :
ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా ఐఫోన్ 14 ప్రో మాదిరిగా స్టైలిష్ డిజైన్ తో సొగసుగా కనబడుతుంది. 6 జిబి ర్యామ్ వంటి పుష్కలమైన మల్టీ టాస్కింగ్ సామర్ధ్యాల కోసం ప్రత్యేకంగా నిలుస్తోందని చెప్పవచ్చు. ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ బ్యాక్ ప్యానెల్ ను కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: