ఐఫోన్ 15 లో కొత్త కలర్ ఆప్షన్.. అమ్మాయిలు మెచ్చే కలర్ కూడా..!
ముఖ్యంగా ఐఫోన్ 15 అమ్మాయిలు మెచ్చే పింక్ కలర్ ఆప్షన్ లో కూడా రాబోతోందని.. గ్రీన్, లైట్ ఎల్లో, పింక్ అనే ఎక్స్ట్రా కలర్ ఆప్షన్ లలో వస్తుందని తాజాగా ట్విట్టర్ వేదికగా శ్రింప్ యాపిల్ ప్రో స్పష్టం చేసింది.ఇకపోతే ఐఫోన్లను తయారు చేయడానికి యాపిల్ తో కలిసి పని చేసే ఫాక్స్ కాన్ కంపెనీ సెక్యూరిటీ బ్యాడ్జ్ తో కూడిన ఒక ఫోటోను కూడా తాజాగా ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫోను మిడ్ నైట్, స్టార్ లైట్, పింక్, గ్రీన్, ఎల్లో, రెడ్ వంటి కలర్ ఆప్షన్ లో ఐఫోన్ 15 వస్తుందని వారు స్పష్టం చేశారుఇకపోతే రూమర్ ప్రకారం బ్లూ కలర్ లో ఐఫోన్ రాదా అని అడగగా యాపిల్ కంపెనీ ఆ నిర్ణయాన్ని మార్చుకొని ఉండవచ్చని తాజాగా ఒక ట్వీట్ కి రిప్లై ఇవ్వడం జరిగింది..
ఇకపోతే ఇంతకుముందు ఐఫోన్ 15 ప్రో డార్క్ బ్లూ కలర్ లో గ్రేయిస్ టోన్ తో వస్తుందన్న ఒక పుకారు హల్ చల్ చెయ్యగా ఈ బ్లూ కలర్ టైటానియం అనే ఒక కొత్త పదార్థంతో తయారయ్యి బ్రష్డ్ ఫినిషింగ్ తో వస్తుందని లీక్ తెలిపింది. మొత్తానికి అయితే ఐఫోన్ 15 రాబోతున్న ఈ కలర్స్ అటు అమ్మాయిలను ఇటు యువతను బాగా ఆకట్టుకోబోతున్నాయని సమాచారం