బుల్లి పిట్ట: వాట్సప్ వినియోగదారులకు అదిరిపోయే అప్డేట్..!!

Divya
రోజు రోజుకి సోషల్ మీడియా వినియోగం పెరిగే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది ముఖ్యంగా ఇందులో వాట్సాప్ సంస్థ కూడా ఒకటని చెప్ప వచ్చు. వరుస అప్డేట్లను విడుదల చేస్తున్న నేపథ్యంలో తాజాగా సరికొత్త ఫీచర్ ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేస్తోంది వాట్సాప్ సంస్థ. తాజాగా తన ఆండ్రాయిడ్ ఐఓఎస్ వినియోగదారుల కోసం నెంబర్ ని చాలా ప్రవేశిక ఉంచేందుకు సరికొత్త ఫీచర్ ను సైతం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం అప్డేట్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. వాటి గురించి తెలుసుకుందాం.


తాజా బీటా అప్డేట్ ను ఇన్స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు కమ్యూనిటీ అనౌన్స్మెంట్ గ్రూప్ సమాచారం లో మొబైల్ నెంబర్ చాలా గోప్యత ఉంచేందుకు సహాయపడుతుందట. వాట్సప్ కమ్యూనిటీలో వారి ఫోన్ నెంబర్ ను దాచడం ద్వారా తమ మొబైల్ నెంబర్ ను నిర్వహించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ తో వారి నెంబర్ కమ్యూనిటీ అడ్మిషన్లకు వారి కాంటాక్ట్ సేవ్ చేసుకున్న ఇతరులకు మాత్రమే కనిపించేలా ఈ అప్డేట్ ఉన్నట్లు తెలుస్తోంది.


సంభాషణలో లేని ఇతర వ్యక్తులకు ఈ మొబైల్ నెంబర్ కనిపించదట .అయితే ఈ ఫీచర్ కేవలం కమ్యూనిటీ సభ్యులకు మాత్రమే పరిమితంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కమ్యూనిటీ అడ్మిషన్ ఫోన్ నెంబర్ ఎల్లప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది.ఆండ్రాయిడ్ ఐవోఎస్ బిట వినియోగదారులకు ఈ అప్డేట్  త్వరలోనే రాబోతున్నట్లు తెలియజేశారు. త్వరలోనే సాధారణ వినియోగదారులకు కూడా ఈ అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. ఇలా వాట్సాప్ సంస్థ వినియోగదారులకు ఆకర్షణీయమైన అప్డేట్లను సైతం ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ ఉండడంతో వాట్సప్ ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఈ మధ్యకాలంలో వాట్సాప్ పలు రకాల అప్డేట్లను సైతం విడుదల చేస్తూ బాగానే వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: