బుల్లి పిట్ట: స్మార్ట్ ఫోన్ కొనేవారికి బంపర్ ఆఫర్.. ప్రైమ్ డే సేల్ షురూ..!

frame బుల్లి పిట్ట: స్మార్ట్ ఫోన్ కొనేవారికి బంపర్ ఆఫర్.. ప్రైమ్ డే సేల్ షురూ..!

Divya
ఈనెల 15 , 16 తేదీలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనున్న నేపథ్యంలో ఈ సేల్ లో భాగంగా భారీ ఆఫర్లను , డిస్కౌంట్ లను అందిస్తామని అమెజాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జూలై 15వ తేదీ ఉదయం 12 గంటల నుంచి ఈ సేల్ ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఇందులో ప్రముఖ బ్రాండ్ల ఫోన్లు అయినటువంటి సాంసంగ్ , రియల్ మీ, మోటోరోలా, వన్ ప్లస్,  ఐక్యూ తో సహా మరెన్నో స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ లు అందుబాటులో ఉండడం గమనార్హం. ఇక స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఇక ఆ ఫోన్ ల  వివరాల గురించి ఇప్పుడు చూద్దాం.

మోటోరోలా razr 40 : ఈ స్మార్ట్ ఫోన్ 6.9 అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లేను కలిగి ఉంటుంది.4200 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ 144 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది . టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్లో 64 మెగాపిక్సల్  ప్లస్ 32 mp వెనుక కెమెరాలతో పాటు 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కూడా అమర్చబడి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.54,999 కే లభిస్తుంది.

వన్ ప్లస్ నార్డ్ 3 5G: ఈ స్మార్ట్ ఫోన్ గత వారమే భారత్లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. 6.74 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉండే ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రీ ఫ్రెష్ రేట్ తో లభిస్తుంది. డస్ట్ ,వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.33,999 కే లభించనుంది.

ఇక వీటితోపాటు రియల్ మీ నార్జో 60 5g, రియల్ మీ నార్జో 60 ప్రో 5g, సామ్సంగ్ M34 5g వంటి పలు రకాల స్మార్ట్ ఫోన్లపై కూడా మీరు డిస్కౌంట్ పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: