బుల్లిపిట్ట: వన్ ప్లస్ నార్డ్ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్..!

Divya
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ తాజాగా మరో మూడు రోజుల్లో తన కొత్త మిడ్ రేంజ్ కెమెరా ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఇక వన్ ప్లస్ నార్డ్ 3 5g స్మార్ట్ ఫోన్ ఈనెల 5వ తేదీన మార్కెట్లోకి రాబోతోంది ఇకపోతే 2021 జూలై నెలలో మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ కి కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తూ ఉండడం గమనార్హం 6.78 అంగుళాల పొడవు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ 1.5 కే రిజల్యూషన్ అమోల్డ్ డిస్ప్లే తో 120 hz రిఫ్రెష్ రేటు తో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతోంది.

ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 5జి ఎస్ఓసి చిప్ సెట్ ను కలిగి ఉంటుంది అలాగే 16gb రామ్, 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
80 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారుగా రూ.32 వేల లోపే ఉంటుందని అంచనా. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీకు మిస్టీ గ్రీన్,  టెంపేస్ట్ గ్రే వంటి రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.


వన్ ప్లస్ నార్డ్ 3 తో పాటు నార్డ్ సి ఇ త్రీ ఫోన్లు, అలాగే నార్డ్ బర్డ్స్ టు ఆర్ ఇయర్ బర్డ్స్ ను కూడా వన్ ప్లస్ తాజాగా రిలీజ్ చేయనుంది. ఇకపోతే వన్ ప్లస్ నార్డ్ త్రీ , అలాగే వన్ ప్లస్ నార్డ్ సి 3 లో కూడా డిస్ప్లే బ్యాటరీ కెమెరా ఫీచర్లు ఒకేలా ఉన్నప్పటికీ ప్రాసెసర్ వేరే ఉండవచ్చు అని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఈ కొత్త సిరీస్ కస్టమర్లను అలరిస్తుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: