బుల్లి పిట్ట: వాషింగ్ మిషన్ ఉందా.. అయితే ఇలా చేయకండి..?

Divya
ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా ప్రతి ఒక్కరు కూడా తమ సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం పలు రకాల ఎలక్ట్రిక్ యంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బట్టలు ఉతకడానికి సైతం ఎక్కువగా వాషింగ్ మిషన్ ఉపయోగిస్తున్నారు. ఇలా సమయం ఆదాయం చేసుకున్న తర్వాత తమ ఇంట్లోని పని చేస్తూ బిజీగా ఉన్నారు మహిళలు. అయితే వాషింగ్ మిషన్ వాడకంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా సరే ప్రమాద బారిన పడబోతున్నారు అంటూ పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే వాషింగ్ మిషన్ వల్ల జరిగే ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి అంటే పలు జాగ్రత్తలు వ్యవహరిస్తూ ఉండాలి.
ఎలక్ట్రిక్ పరికారాలతో ఎంత ఉపయోగమున్నదో అంతే ప్రమాదం ఉన్నది. ఇటీవల కాలంలో ఫ్రిజ్జులు ,వాషింగ్ మిషన్లు పేలుతున్నట్లుగా అక్కడక్కడ సంఘటనలను మనం వింటూనే ఉన్నాము. తరచూ ఎక్కువగా వాషింగ్ మిషన్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ముఖ్యంగా ఇంట్లో ఏవైనా కరెంటుకు సంబంధించి మైనరీ రిపేర్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించిన టెక్నీషియన్లను తీసుకువచ్చి వాటిని సరి చేసుకోవడం మంచిది.. లేకపోతే ఏసీ వాషింగ్ మిషన్ వంటివి షాట్ సర్క్యూట్ కి గురై పేలే ప్రమాదం ఉంటుందట.
వాషింగ్ మిషన్ ని ఉపయోగించేటప్పుడు నీటిని మిషన్ షార్ట్ సర్క్యూట్ కు దూరంగా ఉంచాలి.
వాషింగ్ మిషన్ బటన్స్ పైన నీరు పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి..
అలాగే వాషింగ్ మిషన్ వైర్లను అతికించేటప్పుడు చాలా నాణ్యమైన టేపును ఉపయోగించాలి. వాషింగ్ మిషన్ రిపేర్ చేసేటప్పుడు టెక్నీషియన్స్ ని ఉపయోగించడం మంచిది. ఎప్పటికప్పుడు వాషింగ్ మిషన్ ని సర్వీసింగ్ చేయిస్తూ ఉంటే ప్రమాదాలు జరగడం నివారించవచ్చు.

వాషింగ్ మిషన్ ఏదైనా ఇరుకు ప్రాంతంలో ఉంచే బదులు బయట ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచడం వల్ల వేడి సమస్య తగ్గుతుంది దీనివల్ల వాషింగ్ మిషన్ వేడెక్కకుండా ఉంటుంది.

వాషింగ్ మిషన్ ను ఎక్కువ సమయం ఉపయోగించకుండా తక్కువ సమయంలోనే ప్రతిరోజు ఉపయోగించుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: