బుల్లి పిట్ట: స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం శుభవార్త..!
ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ కి ఆదేశాలు జారీ చేయగా ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా ఉత్తర్వులు పంపించినట్లు సమాచారం. ఇకపై అన్ని మొబైల్ ఫోన్లో కూడా ఎఫ్ఎం రేడియో సర్వీసులు అందుబాటులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం స్మార్ట్ఫోన్ యూజర్లకు మంచి ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎఫ్ఎం సేవలు అందుబాటులో ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి కూడా రేడియో సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పవచ్చు. ప్రస్తుతం అన్ని ఫోన్లలో కూడా ఖచ్చితంగా ఎఫ్ఎం రేడియో రిసీవర్ ఫంక్షన్ ఇన్ బుల్ట్ గా ఉండాలి అని అంటే ఎఫ్ఎం రేడియో సేవలు ఇప్పుడు అన్ని ఫోన్లలోకి అందుబాటులోకి రావాల్సిందే అని స్పష్టం చేసింది. ఒకవేళ ఎఫ్ఎం రేడియో రిసీవర్ లేకపోతే అలాంటి ఫోన్లను దేశీయ మార్కెట్లో విక్రయించడానికి వీలు కల్పించము అని కూడా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం . మొత్తానికైతే ఎఫ్ఎం రేడియో సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ ఉండడం హర్షదాయకమని చెప్పాలి.