బుల్లి పిట్ట: స్మార్ట్ ఫోన్స్ ఉన్నట్టుండి పేలడానికి గల కారణం ఏంటంటే..?

Divya
స్మార్ట్ ఫోన్లు ఈమధ్య కాలంలో ఎక్కువగా పేలడం జరుగుతూ ఉన్నాయి. మనం తరచుగా ఉపయోగించే మొబైల్స్ పేలడం వల్ల సామాన్య ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల కేరళలో కూడా త్రిశూర్లో స్మార్ట్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. ఇలా ఎంతోమంది చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా మొబైల్ పేలి ప్రాణాలు కోల్పోయారు ఇదంతా స్మార్ట్ ఫోన్లు యూజర్ల అజాగ్రత్త వల్లే ఇలా జరుగుతున్నాయని కొంతమంది టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్లు పేలడానికి ప్రధాన కారణాలు బ్యాటరీ కి సంబంధించినవే.. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు కఠినమైన భద్రతా పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తాయని కంపెనీలు చెప్పినప్పటికీ కూడా ఫోన్లు పేలుతున్నప్పుడు అప్పుడప్పుడు రకరకాల నివేదికలు కూడా వస్తున్నాయి.  అయితే ప్రతిసారి స్మార్ట్ ఫోన్ పేలి మంటలు చెలరేగడానికి తయారీదారుల తప్పు కారణం మాత్రం కాదని మనం కచ్చితంగా గుర్తించుకోవాలి. మరి ఈ నేపథ్యంలోనే స్మార్ట్ఫోన్ పేలడానికి మనం కూడా ఒక కారణం అని అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇకపోతే స్మార్ట్ ఫోన్ పేలడానికి మొదటి కారణం బ్యాటరీ అని చెప్పాలి. మొబైల్ ఫోన్లు , స్మార్ట్ ఫోన్లలో లియాన్ బ్యాటరీలతో రూపొందించబడతాయి.  అయితే ఇది కెమికల్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. మొబైల్ ఫోన్ వేడి పెరిగినప్పుడు లేదా వాటి కేసింగ్ దెబ్బతిన్నప్పుడు మాత్రమే స్మార్ట్ ఫోన్ పేలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ హీట్ అవుతోంది అంటే అది ప్రమాదకరంగా భావించాలి.  ముఖ్యంగా వేడి ఉండే ప్రదేశాలలో స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయకూడదు.  లేదా రాత్రిపూట ఛార్జ్ చేయడానికి వదిలేయడం వల్ల ఫోన్ బ్యాటరీ కూడా త్వరగా వేడెక్కుతుంది. ఫోన్ బ్యాటరీ చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ మాట్లాడడం లేదా ఇతర అవసరాలకు ఫోన్ ఉపయోగించినట్లయితే బ్యాటరీ వేడికి పేలే అవకాశం ఉంటుంది. ప్రతి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ 100% పెట్టాల్సిన అవసరం లేదు. 90% ఉన్నప్పుడే స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే స్మార్ట్ ఫోన్ పేలే అవకాశాలు ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: