అమెజాన్: బంపర్ ఆఫర్.. 940/- కే ఒప్పో 5జి ఫోన్?

ఇక ఇప్పుడు అన్ని బ్రాండ్లలో కూడా 5జీ స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఒప్పో కంపెనీ కూడా పలు మోడళ్లను తీసుకొచ్చింది. దానిలో ఒప్పో ఏ74 5జీ ఫోన్ ఒకటి. మీరు వేగవంతమైన కనెక్టవిటీతో పాటుఇంకా అధిక సామర్థ్యంతో కూడిన పనితీరు కావాలనుకుంటే మీకిదే చాలా బెస్ట్‌ ఆప్షన్‌. ఇది 6జీబీ ర్యామ్‌ తో పాటు 128జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజీ సామర్థ్యంతో మార్కెట్లోకి వస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ పై అమెజాన్‌ లో భారీ బంపర్‌ ఆఫర్‌ ఉంది. కంపెనీ అందిస్తున్న 26శాతం డిస్కౌంట్‌ తో పాటు అదనంగా పాత ఫోన్‌ ఎక్చేంజిపై కూడా భారీ డిస్కౌంట్‌ అనేది మీకు లభిస్తుంది. మొత్తమ్మీద అన్ని ఆఫర్లు కలిపి ఈ ఫోన్‌ కేవలం మీరు రూ. 940కే పొందవచ్చు.ఇక ఒప్పో ఏ74 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 6GB/128GB కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. లాంచింగ్ సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ధర వచ్చేసి రూ. 20,990/- గా ఉండేది.


ప్రస్తుతం అమెజాన్‌ లో దీని ధర మొత్తం రూ. 15,490గా ఉంది.ఇక ఒప్పో ఏ74 5జీ స్మార్ట్‌ ఫోన్‌ కి 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యంతో ఈ ఫోన్ వస్తోంది. దీనిలో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్ కూడా ఉంటుంది. అలాగే వెనుకవైపు 48ఎంపీ+2ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ కి ఉంటుంది.ఇందులో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. అలాగే 5000 mAh బ్యాటరీ సామర్థ్యం ఇంకా 18 వాట్స్‌ ఛార్జర్ ఇస్తారు.ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర వచ్చేసి రూ. 15,490గా ఉండగా.. మీ పాత ఫోన్‌ ఎక్స్‌ చేంజ్‌ పై దాదాపు రూ.14,550 దాకా ఆదా చేసుకోవచ్చు. అంటే కేవలం రూ. 940/- లకే మీరు ఒప్పో ఏ74 5జీ స్మార్ట్‌ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: