బుల్లి పిట్ట: డేటా త్వరగా అయిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..!!

Divya
మొబైల్ డేటా అయిపోయి ఇంటర్నెట్ వాడలేక చాలా ఇబ్బంది పడుతున్న వారు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వీడియోలు చూడకపోయినా డౌన్లోడ్ చేయకపోయినా మొబైల్ డేటా అలా ఎందుకు అయిపోతుందో తెలియక చాలా సతమతమవుతూ ఉన్నారు. అయితే మొబైల్ లో ఉండే కొన్ని సెట్టింగ్స్లను మార్చుకోవడం వల్ల మన మొబైల్ డేటా ఆటోమేటిక్గా ఖర్చు కాకుండా ఉంటుందట. కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ తో మొబైల్ డేటాను సేవ్ చేయవచ్చట.
అదెలాగంటే మొబైల్ డేటాను ఎక్కువగా వాడుకునేవి యాప్స్ కాబట్టి యాప్స్ ఎంత డేటా వాడుకుంటామో ముందుగా తెలుసుకోవాలి దానికోసం డేటా యూజస్ సెట్టింగ్ లోకి వెళ్లి డేటా ఎక్కువగా వాడుతున్న యాప్స్ ను గుర్తించి వాటి వాడకాన్ని తగ్గించుకోవాలి. అలాగే కొన్ని యాప్స్ ను ఓపెన్ చేయకపోయినా బ్యాక్గ్రౌండ్ లో డేటాను వాడుకుంటూనే ఉంటాయి.కాబట్టి అనవసరం గా అలాంటి యాప్స్ లను బ్యాగ్రౌండ్ యూజెస్ లిమిట్ సెట్ చేసుకోవడం మంచిది. ఇకపోతే యాప్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉండడం వల్ల కూడా చాలా డేటా పూర్తి అవుతుంది. అందుచేతనే ప్లే స్టోర్ లోకి వెళ్లి సెట్టింగ్లు నెట్వర్క్ ప్రిఫరెన్స్ మూడులో డౌన్లోడ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

గూగుల్ డ్రైవ్ యాపిల్ క్లౌడ్ లాంటి యాప్స్ ఆటోసింగ్ కింగ్ ఆన్ చేసిన ఓన్లీ విత్ వైఫై ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. దీనివల్ల మొబైల్ డేటా కూడా ఖర్చు అవ్వకుండా ఉంటుంది.గూగుల్ యాప్స్ ఉపయోగించేటప్పుడు లొకేషన్ రూట్ మ్యాప్ లోడ్ అయ్యేందుకు డేటా ఎక్కువగా తీసుకుంటుంది కానీ ఆ తర్వాత నావిగేషన్ కోసం డేటా అవసరం ఉండదు. కాబట్టి యాప్ లో రూటు సెట్ చేసుకున్నాక మొబైల్ డేటా ఆఫ్ చేసి మ్యాప్ ను ఉపయోగించుకోవచ్చు. వీడియోలు టీవీ చూసేటప్పుడు ఆటోమేటిక్ క్వాలిటీ సెట్ చేసుకుంటే డేటా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: