ఆకట్టుకునే లుక్ తో బెంగళూరు ఎలక్ట్రిక్ స్కూటర్?

బెంగళూరుకి చెందిన ఫేమస్ స్టార్టప్ కంపెనీ రివర్ తన 'ఇండీ'  ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఈ స్కూటర్ చూడటానికి చాలా అందంగా వుంది. ఇంకా అంతేగాక ఎక్కువ స్టోరేజ్ స్పేస్, ఫ్రంట్ ఫుట్‌పెగ్‌లు ఇంకా అలాగే క్రాష్ గార్డ్ వంటి సూపర్ ఫీచర్స్ ని పొందుతుంది.దీని ధర విషయానికి వస్తే..రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)ఉంటుంది. ఇక కంపెనీ ఇప్పటికే ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది.అలాగే దీని డెలివరీలు 2023 ఆగష్టు నెలలో ప్రారంభమవుతాయి.రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 4kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఒక ఛార్జ్‌పై ఏకంగా 150 కి.మీ రేంజ్ అందిస్తుంది.అయితే వివిధ వాతావరణ పరిస్థితుల్లో మొత్తం 120 రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇంకా ఈ స్కూటర్ కేవలం 5 గంటలలో 0-80 శాతం ఈజీగా ఛార్జ్ చేసుకోగలదు. ఇంకా అలాగే ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది.


ఈ రివర్ ఇండీ బ్యాటరీ ప్యాక్ 8.98 బిహెచ్‌పి పవర్ ఇంకా 26 ఎన్ఎమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇది 3.9 సెకన్లలో గంటకు ఏకంగా 90 కిమీ వేగంతో ముందుకు వెళ్తుంది. ఇందులో ఎకో, రైడ్ ఇంకా రష్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.ఇంకా అలాగే ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ ఇంకా వెనుక ట్విన్ హైడ్రాలిక్ షాక్‌ అనేవి ఉన్నాయి.ఇంకా ఈ లేటెస్ట్ స్కూటర్ ఒక ప్రత్యేకమైన డిజైన్ ని కూడా పొందుతుంది. అందువల్ల మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌, ఎల్ఈడీ టైల్‌లైట్ వంటి వాటితో పాటు కాంట్రాస్ట్ డిస్‌ప్లే ఇంకా ఛార్జింగ్ పోర్ట్ ని కూడా పొందుతుంది. ఇందులోని పన్నీర్ మౌంట్స్ లగేజ్ మోయడానికి ఎంతగానో సహాయపడతాయి.ఇంకా ఈ రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది. అందువల్ల ఇందులో 12 లీటర్ల గ్లోవ్ బాక్స్ ink243 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది మాన్‌సూన్ బ్లూ, సమ్మర్ రెడ్ ఇంకా స్ప్రింగ్ ఎల్లో వంటి మూడు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ బ్యాటరీ ఇంకా స్కూటర్ రెండింటికీ 5 సంవత్సరాల/50,000 కిమీ వారంటీని అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: