షాకిస్తున్న ఓలా బ్యాటరీ ధర..?

ఇక ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకి బాగా పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫేమస్ ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీ 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.అయితే స్టార్టింగ్ నుంచి కొన్ని సమస్యల ఉన్నా కానీ ఈ స్కూటర్ మంచి అమ్మకాలనే పొందింది. అయితే ఈమధ్య ఓలా ఎలక్ట్రిక్‌కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఒకటి వెలువడింది.సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఓలా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఇందులో ఓలా ఎస్1 బ్యాటరీ ధర రూ. 66,549 (3kwh), ఎస్1 ప్రో 4kwh బ్యాటరీ ధర రూ. 87,298 అని ఆ పోస్ట్ లో వుంది. ఇంకా దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే పెట్రోల్ స్కూటర్లతో కంపేర్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం వాటిలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీ ప్యాక్ ఖరీదు వెహికల్ ధరలో  మొత్తం 70 శాతం ఉంటుందని చాలా కంపెనీలు గుర్తించాయి.


అందువల్ల వాహనంలో ఏదైనా సమస్య వల్ల బ్యాటరీ పాడైపోతే కొత్త బ్యాటరీ ఇన్‌స్టాల్ చేయడానికి వినియోగదారుడు ఖచ్చితంగా చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి.ఇక ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ. 99,999 (ఎస్1) నుంచి రూ. 1,29,999 దాకా (ఎస్1 ప్రో) ఉన్నాయి. కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్ మీద మొత్తం 3 సంవత్సరాల వారంటీ కూడా అందిస్తున్నాయి. కంపెనీ నియమాల ప్రకారం 3 సంవత్సరాల లోపల బ్యాటరీలో ఏదైనా సమస్య కనుక ఏర్పడితే ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా బ్యాటరీ రీప్లేస్ చేస్తారు.ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే చాలా కంపెనీలు కూడా బ్యాటరీలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలు కూడా మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ ఉంటాయి. అయితే ఈ ప్రమాదాలను అరికట్టడానికి దీనిపైన సమగ్ర పరిశీలనలు అనేవి జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: