తక్కువ బడ్జెట్ లో సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్?

బైక్ కొనుగోలుదారుల కోసం బడ్జెట్ లెవెల్ లో  గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. యాంపియర్ జీల్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీడియం స్పీడ్ రేంజ్ స్కూటర్లలో ఈ యాంపియర్ జీల్ ఈఎక్స్ అనేది బెటర్ ఆప్షన్ గా ఉంటుంది. ఇక ఈ ఎలక్రిక్ స్కూటర్ ధర వచ్చేసి రూ. 69,900( ఎక్స్ షోరూం) గా గ్రీవ్స్ కంపెనీ ప్రకటించింది. అయితే ఇది కేవలం మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ ఇంకా అలాగే జార్ఖండ్ లో మాత్రమే ఈ ధర అందుబాటులో ఉంటుంది. మిగిలిన రాష్ట్రంలో దీని ధర రూ. 75,000(ఎక్స్ షోరూం) ఉంటుంది. అంటే దాదాపు రూ.5,100 దాకా ఎక్కువ ఉంటుంది. అయితే మార్చి 31 వరకూ ఈ స్కూటర్ కొనుగోలుపై దాదాపు రూ. 6,000 దాకా తగ్గింపును అందిస్తామని ఆ కంపెనీ ప్రకటించింది.ఈ యాంపియర్ జీల్ స్కూటర్ లో 2.3 kwh సామర్థ్యంతో కూడిన లిథియం బ్యాటరీ ఇంకా అలాగే 1.8 kw వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.


దీనిలో ఉన్న బ్యాటరీని ఒక్క సారి చార్జ్ చేస్తే ఏకంగా 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇంకా అలాగే గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఇంకా ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి మొత్తం ఐదు గంటలు సమయం పడుతుంది.ఇక ఫీచర్ ల విషయానికి వస్తే.. ఈ స్కూటర్ లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఇంకా రెండు వైపులా డ్రమ్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. ఈ బైక్ మొత్తం నాలుగు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టోన్ గ్రే, ఐవోరీ, వైట్ ఇంకా అలాగే ఇండిగో బ్లూ వంటి కలర్ వేరియంట్లలో ఈ స్కూటర్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.ఇక గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ బెల్ మాట్లాడుతూ తమ కొత్త ఉత్పత్తి యాంపియర్ జీల్ ఈఎక్స్ స్కూటర్ వినియోగదారులకు చాలా అద్భుతమైన రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని ఆయన చెప్పారు. అత్యంత తక్కువ బడ్జెట్ లో ఈ స్కూటర్ ని అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీని ఫీచర్లు, కంఫర్ట్, పెర్ఫార్మెన్స్ ఇంకా సేఫ్టీలో కూడా ఎక్కడా రాజీ పడలేదని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: