సబ్బు కనిపెట్టకముందు.. బట్టలు ఎలా ఉతికేవారో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో ఎన్నో విభిన్నమైన రీతిలో ఉండే దుస్తులను ధరించడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త రకం దుస్తులు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇక ఎలాంటి దుస్తులు అయినా ధరించిన తర్వాత మురికి పడటం సర్వసాధారణం. ఇలా మురికి పడిన సమయంలో వాటిని ఉతికి మళ్లీ తిరిగి వేసుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఉతకడానికి వాషింగ్ మెషిన్లు వచ్చాయి. ఇక  అదే సమయంలో మార్కెట్లోకి ఎన్నో రకాల సబ్బులు, సర్ఫ్ లు కూడా బట్టలు ఉతికేందుకు అందుబాటులో ఉన్నాయి.

 ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది ఇలా సబ్బులు, సర్ఫ్ లు ఉపయోగించి బట్టలను తల తల ఉతికేస్తూ ఉన్నారు. కానీ ఇలా సబ్బులు, సర్ఫ్ లు అందుబాటులోకి రాకముందు ప్రజలు బట్టలను ఎలా ఉతికే వారు అన్నది మాత్రం చాలా మందికి తెలియని సమాధానం. సుమారు 130 సంవత్సరాల క్రితం  డిటర్జెంట్ భారతదేశంలో తొలిసారి వాడుకలోకి వచ్చింది. బ్రిటిష్ కంపెనీ లేబర్ బ్రదర్స్ ఇంగ్లాండ్ భారత మార్కెట్లో ఈ సబ్బును విడుదల చేసిందట. మరి సబ్బులు, సర్ఫ్ లు అందుబాటులోకి రాకముందు బట్టలను ఎలా ఉతికేవారో తెలుసుకుందాం..

 సబ్బులు, సర్ఫ్ లు అందుబాటులోకి రాకముందు తాము వేసుకున్న తర్వాత మురికి పడిన దుస్తులను ఇక సేంద్రీయ వస్తువులను ఉపయోగించి శుభ్రం చేసుకునే వారట. ఇలా బట్టలు ఉతికేందుకు ఎక్కువగా కుంకుడు కాయలు ఉపయోగించేవారట. అప్పట్లో రాజులు రాజ భవనాల తోటలలో కూడా కుంకుడుకాయ చెట్లను ఎక్కువగా నాటే వారట. ఇక దాని నుంచి వచ్చే నురుగుతోనే బట్టలను శుభ్రం చేసేవారట. అంతేకాదు ఇక ఇలా కుంకుడు కాయలతో ఉతికిన బట్టలు తల తల మెరిసిపోయేవట. ఇప్పుడు కూడా ఖరీదైన పట్టువస్తాలను శుభ్రం చేయడానికి కుంకుడు కాయలను ఉపయోగిస్తారు అన్న విషయం తెలిసిందే. కుంకుడు కాయలు అందుబాటులో లేనివారు వేడినీళ్లలో నాలబెట్టి.. రాళ్లకు గట్టిగా కొడుతూ మురికిని వదిలించుకునేవారట. ఇక కొంతమంది ఇసుకను ఉపయోగించి కూడా బట్టలను ఉతుక్కునేవారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: