ఫేమస్ ఎలక్ట్రానిక్ కంపెనీ వన్‌ప్లస్ ఇప్పటి దాకా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు ఇంకా అలాగే వాచ్‌లతో టెక్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని క్రియేట్ చేసుకుంది.ఫస్ట్ లో ప్రీమియం ప్రొడక్ట్స్‌ను మాత్రమే తీసుకొచ్చిన వన్‌ప్లస్ ఆ తర్వాత బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇక తాజాగా ఈ వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ట్యాబ్స్ కూడా రాబోతున్నాయి. వన్‌ప్లస్ ఫిబ్రవరి 7 వ తేదీన క్లౌడ్ 11 ఈవెంట్‌ను ప్రకటించనుంది.ఈ ఈవెంట్లో భాగంగా వన్‌ప్లస్ OnePlus 11 5g, OnePlus 11R 5g స్మార్ట్ఫోన్లు, OnePlus tv 65 Q2 ప్రో, OnePlus బడ్స్ ప్రో 2 ఇంకా అలాగే OnePlus మెకానికల్లను గ్రాండ్‌గా లాంచ్ చేయబోతోంది. అయితే ఇదే ఈవెంట్లో వన్‌ప్లస్ ఫస్ట్ టైం తమ బ్రాండ్ నుంచి వన్‌ప్లస్ ప్యాడ్‌ను లాంచ్ చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే వన్‌ప్లస్ ప్యాడ్ లాంచ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, కంపెనీ అధికారిక సైట్‌లోని OnePlus 11 5g లైవ్ లిస్టింగ్‌లో OnePlus ప్యాడ్ గురించి వివరాలు తెలిపినట్లు సమాచారం తెలుస్తుంది.
ఇంకా అంతేకాదు వన్‌ప్లస్ ప్యాడ్ ఫీచర్లు ఇంకా అలాగే ధరలకు సంబంధించి కొన్ని వివరాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఈ వివరాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. వన్‌ప్లస్ ప్యాడ్‌లో 12.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ + ఓఎల్ఈడీ డిస్ప్లేని ఇవ్వనున్నారు. అలాగే స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ట్యాబ్‌లో 6జీబీ ర్యామ్ ఇంకా 128 జీబీ స్టోరేజ్ ఉండనున్నట్లు సమాచారం తెలుస్తుంది. అలాగే దీని కెమెరా విషయానికొస్తే ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం తెలుస్తోంది. 13 ఎంపీ రెయిర్ మెయిన్ కెమెరా ఇంకా 5 ఎంపీ సెకండరీ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఇందులో 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 10,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది.