బుల్లి పిట్ట: సాంసంగ్ రిపబ్లిక్ డే సేల్ ఆరంభం..50% పైగా డిస్కౌంట్..!

Divya
సాంసంగ్.. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా గ్రాండ్ సేల్ ని ప్రకటించింది. ఇందులో కష్టమర్లకు కంపెనీకి చెందిన వివిధ రకాల ఉత్పత్తులపై వివిధ రకాల ఆఫర్లు, తగ్గింపులు ఇస్తూ భారీ డిస్కౌంట్ ధరకే వస్తువులను అందజేస్తూ ఉండడం గమనార్హం. జనవరి 17న ప్రారంభమై జనవరి 21 2023 వరకు అమలులో ఉండే ఈ గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా అనేక ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి.. ముఖ్యంగా Samsung.com, SamsungShop app లేదా సామ్సంగ్ డిజిటల్ స్టోర్ నుంచి కూడా కస్టమర్లు ఈ సేల్ ఆఫర్లను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా టెక్ దిగ్గజం గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ల శ్రేణి పై 61 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.  అలాగే సాంసంగ్ టీవీల పై 56% వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. గాలక్సీ లాప్టాప్ లపై 38% వరకు డిస్కౌంట్ లభిస్తూ ఉండడం గమనార్హం.  అలాగే టాబ్లెట్ ల పై 63% తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ సేల్ లో గెలాక్సీ వాచ్ 5,  గ్యాలక్సీ బడ్స్ 2 ప్రో వంటి గెలాక్సీ ఉపకరణాలపై కూడా మీరు భారీ డిస్కౌంట్ తో వస్తువులను సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా కంపెనీ టీవీలు ఇతర ఉపకరణాలు కొనుగోలుపై 20 శాతం క్యాష్ బ్యాక్ ని కూడా అందిస్తోంది అలాగే samsung గాడ్జెట్ లపై శాంసంగ్ కస్టమర్లు రూ.10 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

అదనంగా కొత్త వినియోగదారులు రూ.6,500 విలువైన వెల్కమ్ ఓచర్లను కూడా పొందుతారు. సగం దొరకే జనాధారణ పొందిన ఫోన్లను ఇందులో మీరు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా గాలక్సీ Z ఫోల్డ్ 4, గాలక్సీ S 21 FE తోపాటు మరెన్నో గెలాక్సీ స్మార్ట్ ఫోన్లపై వీరు ఆఫర్లు పొందవచ్చు.  వీటన్నింటిపై కూడా మీకు 61 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: