బుల్లి పిట్ట: 22,000 బ్యాటరీ బ్యాకప్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే పది రోజులు..!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థలలో ఒకటైన doogee v max సరికొత్త మొబైల్ 5g మొబైల్ ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నట్లుగా కూడా తెలియజేస్తోంది. ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ సూపర్ కెమెరాతోపాటు అధిక ర్యామ్ వంటి ప్రత్యేకతలు కూడా ఈ మొబైల్ లో ఉండబోతున్నట్లు సమాచారం. అయితే అన్ని మొబైల్స్ కంటే ఈ మొబైల్ లో 22 వేల ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మొబైల్ మొట్టమొదటిసారిగా ఇంతటి చార్జింగ్ కలిగిన మొబైల్ గా పేరు పొందుతోంది. అలాగే 33 వాట్స్ టైప్ -c చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండబోతోంది.
ఈ బ్యాటరీ చార్జింగ్ పది రోజుల వరకు ఉండవచ్చని సమాచారం. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు పది రోజుల వరకు ఈ మొబైల్ ను ఉపయోగించుకోవచ్చట. అలాగే మొబైల్ స్టాండ్ బై 64 రోజుల వరకు వస్తుందని సమాచారం. అయితే ఈ మొబైల్ చూడడానికి చాలా పెద్దదిగా ఉంటుందని ముఖ్యంగా మందం విషయంలో కూడా 27.3 MM మందంతో అధిక బరువు కలిగి ఉంటుందని సమాచారం.6.58 పెంచల హెచ్డి డిస్ప్లే.. 32 ఎంపీ సెల్ఫీ కెమెరా..108 బ్యాక్ కెమెరా కలిగి ఉంటుంది. దీని ధర సుమారుగా రూ .40 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం.