బుల్లి పిట్ట: ఇంటర్నెట్ లేకుండా అమౌంట్ సెండ్ చేయడం ఎలా..?
అయితే ఈ యాప్స్ మీరు ఉపయోగించాలి అంటే కచ్చితంగా మీ ఫోన్లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే ఈ యాప్స్ ద్వారా మనీ సెండ్ చేయలేము. కానీ కేంద్ర టెలికాం సంస్థ గతంలో ప్రవేశపెట్టిన ఒక విధానం ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా సరే ఇతరులకు మనం డబ్బు సెండ్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ ద్వారా *99# అని డయల్ ప్యాడ్ లో ఎంటర్ చేయాలి. అక్కడ మన బ్యాంకు డీటెయిల్స్ చూపడంతో పాటు సెండ్ మనీ . రిక్వెస్ట్ మనీ..బాలన్స్ ఎంక్వయిరీ ఇలా కొన్ని రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మనకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఉదాహరణకు డబ్బు పంపించాలనుకుంటే సెండ్ మనీ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు మనీ ఏ విధంగా పంపించాలి అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.. త్రూ మొబైల్ ద్వారా లేదా యూపీఐ నెంబర్ ద్వారా లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్పుడు మీరు యూపీఐ ద్వారా డబ్బు సెండ్ చేయాలనుకుంటే.. మనం ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నామో వారి యొక్క యూపీఐ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి సెండ్ చేయాలి. ఆ తర్వాత ఆ యూపీఐ ఐడి యొక్క పేరు వివరాలను మనకు చూపిస్తుంది. వాటిని మరొకసారి చెక్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి సెండ్ చేస్తే సులభంగా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందుకు ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేదు.