బుల్లి పిట్ట: సామాన్యులకు కూడా అందుబాటు ధరలో శ్యామ్ సంగ్ స్మార్ట్ మొబైల్..!!
ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుందట. బేసిక్ స్మార్ట్ మొబైల్ కొనాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. అయితే ఈ మొబైల్ రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తుందని సాంసంగ్ సంస్థ తెలియజేస్తోంది. అంటే దాదాపుగా ఆండ్రాయిడ్ 14 వరకు అప్గ్రేడ్ కావచ్చు. దీని ద్వారా అధికంగా అమ్మకాలు చేయడమే కాకుండా శాంసంగ్ కంపెనీకి కూడా మంచి లాభాలు వస్తాయనే నమ్మకంతో ఈ మొబైల్ ని తయారుచేసినట్లుగా తెలుస్తోంది.
ఈ మొబైల్ ఫీచర్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ డిస్ప్లే 6.51 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో పాటు 90 HZ రిఫరెన్స్ రేటు కలదు. వెనక భాగమున 13 మెగాపిక్సల్ కెమెరాతోపాటు 2 మెగా ఫిక్స్ కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కలదు. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యంతో కలదు.15 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది.4GB ram తో పాటు 64 జీవి సపోర్టింగ్ తో కూడా కలదు ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు మరికొన్ని ఫీచర్లను కూడా ఈ మొబైల్లో అమర్చినట్లుగా తెలియజేస్తోంది. ఈ మొబైల్ ఈనెల 16వ తేదీ నుంచి అమెజాన్ లో కొనుక్కోవచ్చు.