బుల్లి పిట్ట: రూ.15 వెల్లకే వన్ ప్లస్ మొబైల్..!!

Divya
ప్రముఖ బ్రాండెడ్లలో ఒకటైన వన్ ప్లస్ మొబైల్ కస్టమర్ల కోసం పలు ఆసక్తికరమైన మొబైల్స్ ను తక్కువ ధరలకే విడుదల చేస్తోంది. ఇప్పుడు తాజాగా వన్ ప్లస్ నార్డ్ N20SE స్మార్ట్ మొబైల్ ని మనదేశంలో విడుదల చేయబోతోంది. అయితే దీన్ని కంపెనీ అధికారికంగా లాంచ్ చేయలేదు కానీ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ అతి తక్కువ ధరలకే లభిస్తోంది. మరి ఈ మొబైల్ యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.
One plus nord n-20SE:
స్మార్ట్ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యం తో పాటు 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో సరికొత్త ఫీచర్లతో ఈ మొబైల్ ఉండనుంది.ఈ మొబైల్ వెనుక రెండు కెమెరాలు అందించనున్నారు.వీటిలో ప్రధానంగా 50 మెగాపిక్సల్ సెన్సార్ కెమెరాతో కలదు. ఈ మొబైల్ 4GB రామ్ +64 GB స్టోరేజ్ మెమొరీ పేరెంట్లు అందుబాటులో కలదు. ఈ మొబైల్ అమెజాన్ లో రూ.14,590 రూపాయలు ఉండగా. ఫ్లిప్ కార్ట్ లో రూ.14,979 రూపాయలతో ఈ మొబైల్ కొనుగోలు చేసుకోవచ్చు.
ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది.6.56 అంగుళాల డిస్ప్లే తో కలదు 2D స్లిమ్ బాడీ తో  పాటు ఈ మొబైల్ మార్కెట్లోకి ఎంట్రీస్తోంది. ఈ మొబైల్ ప్రాసెస్ వివరాలను కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ మీడియా టెక్ హిలియో G -35 అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ 50% చార్జింగ్ అవ్వడానికి కేవలం 30 నిమిషాలు సమయం మాత్రమే పడుతుందని కంపెనీ తెలియజేసింది. గతంలో విడుదలైన ఒప్పో A57 బ్రాండెడ్ వర్షన్ మొబైల్ మోడల్ గా ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక  పోస్ట్  కాస్త వైరల్ గా మారుతోంది. ఈ మొబైల్ అతి తక్కువ ధరకే వన్ ప్లస్ బ్రాండ్ నుంచి విడుదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: