బుల్లి పిట్ట: రూ.15 వేలకే జియో ల్యాప్ ట్యాప్..!!
ఇప్పటికే ఇందుకు సంబంధించిన వాటిలో క్వాల్ క్వామ్ సంస్థతోపాటు మైక్రోసాఫ్ట్ సంస్థతో రిలయన్స్ జియో సంస్థ ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం దీని ద్వారా చౌకమైన ధరలకు విండోస్, ఓ ఎస్ ద్వారా చౌకమైన ధరలకే ల్యాప్ ట్యాప్ ను రూపొందించబోతున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా ఈ ల్యాప్ ట్యాప్ విద్యార్థుల కోసం ప్రభుత్వ సంస్థల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జీయో సంస్థ పలు టెక్నాలజీని ఉపయోగించుకొని పలు ప్రాడెక్టులను, 5g నెట్వర్క్ సంబంధించిన వాటిని త్వరలోనే విడుదల చేయబోతోంది
ఇక తాజాగా ఈ స్మార్ట్ ల్యాప్ ట్యాప్ ను మరో మూడు నెలలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ల్యాప్ ట్యాప్ ను జియో బుక్ అనే పేరుతో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది దీన్ని పూర్తిగా దేశంలోని తయారు చేస్తున్నట్లుగా ఆ సంస్థ తెలియజేశారు కనీసం 15% మార్కెట్ లక్ష్యంగా రిలయన్స్ దీనిని రూపొందిస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. దీంతో సామాన్యు విద్యార్థులు సైతం ఈ ల్యాప్ ట్యాప్ ను ఉపయోగించుకునే విధంగా వీటిని తయారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఎంతవరకు ఫీచర్లతో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.