బుల్లి పిట్ట: నథింగ్ మొబైల్ పై..భారీ డిస్కౌంట్..కొన్ని గంటలు మాత్రమే..!!

Divya
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన నథింగ్ మొబైల్ మార్కెట్లో ఎంతటి పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో కూడా ఎంట్రీ ఇచ్చి తన హవా కొనసాగిస్తూ ఉన్నది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక సెల్నీ మాత్రమే ప్రస్తుతానికి పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఫ్లిప్ కార్ట్ వేదికగా మరొకసారి రెండవ సేల్ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సెల్ తో భారీ డిస్కౌంట్ను అందించనున్నట్లుగా తెలుస్తోంది మరి వాటి గురించి కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

తాజాగా ఫ్లిప్ కార్ట్ లో కేవలం కొన్ని ప్రాడెక్టులకు మాత్రమే పలు ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాంటి వాటిలో నథింగ్ మొబైల్ పైన కూడా భారీగా ఆఫర్ ని ప్రకటించింది. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సెల్ మొదలుకానుంది. ఇందులో భాగంగానే ఈ ఆఫర్ కింద నథింగ్ మొబైల్ ఆఫర్ కింద బేసిక్ మోడల్ గల మొబైల్ రూ.28,999 రూపాయలకి సొంతం చేసుకునే విధంగా తమ యూజర్స్ కి అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. అంతేకాకుండా పలు బ్యాంకుల కార్డులతో ఈ మొబైల్ ను కొనుగోలు చేస్తే..10% వరకు డిస్కౌంట్ను కల్పిస్తోంది.

అంతేకాకుండా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా కూడా అదనంగా రూ.3000 వరకు డిస్కౌంట్ను కూడ పొందవచ్చు.. ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే 6.55 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో కలదు. స్నాప్ డ్రాగన్ 778G ప్రాసెస్ తో ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో  వెనుక భాగాన 50 M పిక్సెల్ కెమెరాతో పాటు సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను అందిస్తోంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..4500 MAH సామర్థ్యంతో కలదు. ఈ మొబైల్ ర్యామ్ మెమొరీ వేరియంట్ను బట్టి ధరలు మార్పులు ఉంటాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: