డేటింగ్ యాప్ లు డౌన్లోడ్ చేసేవారికి హెచ్చరిక?

డేటింగ్‌ యాప్‌లు, సోషల్‌ మీడియా నుంచి వివరాలు సేకరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు రోజుకొక కొత్త ఎత్తుగడతో ముందుకొస్తున్నారు. వీటిలో డిజిటల్‌ సెక్స్ ఒకటి. ఈ వలలో ఆడ, మగ.. ఇద్దరూ సులభంగా పడిపోతున్నారు. వారిలో ఎక్కువమంది మధ్య వయస్కులు, బాగా చదువుకున్నవారు, మధ్యతరగతి వారే. ఇతర వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్సీ నంబర్లను ఎంచుకుంటారు. బలహీనతను క్యాష్‌ చేసుకుని ఆర్థిక ఇంకా అలాగే లైంగిక దోపిడికి పాల్పడుతున్నారు. తెలియని నంబర్‌ నుంచి న్యూడ్‌ వీడియోకాల్‌ చెయ్యడం, అందమైన ఫొటోలు పెట్టడం, కవ్వించి మన వీడియోలు, ఆడియోలు రికార్డు చేసి డబ్బు వసూలు చేయడం.. వీళ్ల వ్యూహాలు. 'గే'లు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి స్నేహితులుగా నటిస్తూ.. కుటుంబసభ్యులు అనారోగ్యంగా ఉన్నారని, వీసా సమస్యలు వస్తున్నాయని, గిఫ్ట్‌లు పంపుతున్నామని అబద్దాలు చెప్పి డబ్బులు దోచేస్తారు.అందుకే ఎప్పుడూ కూడా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు, కాల్స్‌, మెసేజ్‌ రిక్వెస్ట్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఆన్‌లైన్‌ చాటింగ్‌, డేటింగ్‌ ప్రయత్నించవద్దు.


ఆన్‌లైన్‌ ద్వారా పరిచయం అయినవారికి ఎప్పుడూ డబ్బులు, వ్యక్తిగత వివరాలు పంపొద్దు.కొందరు ఆన్‌లైన్‌ పరిచయాలను ఆసరాగా చేసుకొని ప్రముఖుల కాంటాక్ట్స్‌ ఇవ్వమని అడుగుతారు. బయట కలుద్దామని, వీడియోకాల్స్‌ చేసుకుందామని ఒత్తిడి తెస్తారు.మీకు గుర్తు తెలియని ఖాతాల నుంచి ఇమేజ్‌లు వస్తే.. వాటిని https://www.tineye.com లేదా google రివర్స్‌ ఇమేజ్‌ చెక్‌ (https://images.google.com)లో ఇమేజ్‌ సెర్చ్‌ చేయండి. ప్రియమైనవారితో సన్నిహితంగా ఉన్న చిత్రాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడమే మంచిది. ఒక్కోసారి స్కామర్లు వాటిని మార్ఫింగ్‌ చేసి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేస్తారు.డిజిటల్‌ శృంగారం ఓ భద్రత లేని చర్య. మన భావోద్వేగాలతో మోసగాళ్లు ఆడుకునే ఆట. అలాంటి చర్యకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.ఇప్పటికే డిజిటల్‌ శృంగార బాధితులై ఉంటే, ఆ తరహా హెచ్చరికలు అందుతూ ఉంటే.. ఆలస్యం చెయ్యకుండా దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యండి. లేదా https://cybercrime.gov.in/లో ఫిర్యాదు చెయ్యండి. బాధితులు ఎవరైన ఉంటే వెంటనే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కి ఇప్పుడే కాల్‌ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: