చాలా మందికి కూడా ఎలుకలతో చాలా తలనొప్పి అనేది ఉంటుంది. ఆ ఎలుకలని తరిమికొట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వుంటారు. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. అవి ఇంట్లోకి వస్తే మనం చాలా ఇబ్బందిగా ఫీలవుతాం. వాటిని తరిమికొట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం.ఇంట్లో వస్తువులను ఎలుకలు పాడుచేస్తాయి. ఇంట్లో ఉంచిన ముఖ్యమైన వస్తువులను పదునైన పళ్లతో కొరుకుతూ చెత్త.. చెత్తగా మార్చేస్తాయి. ఎలుకలు చేసే
అల్లరి మాములుగా ఉండదు. వాటిని వదిలించుకోవడానికి ఉల్లిపాయలు, వెల్లుల్లి, లవంగాలు వంటి చాలా రకాల చిట్కాలను ఉపయోగిస్తుంటాం. అయితే అరటిపండ్ల నుంచి కూడా ఎలుకలు భయపడి పారిపోతాయని మనలో చాలా మందికి తెలియదు.అరటిపండ్ల నుంచి వచ్చే వాసన వాటికి అస్సలు నచ్చదు. అందుకే ఎలుకలు పారిపోతాయని ఓ పరిశోధనలో తేలింది. అరటిపండ్ల వాసనను చూస్తే ఎలుకలు ఒత్తిడికి గురవుతాయి.. వాటిలో ఓ రకమైన హార్మోన్లు విడుదలవుతాయని పరిశోధనలో తేలింది. అరటిపండ్ల వాసనలో N-పెంటైల్ అసిటేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం కారణంగా, ఎలుకలో ఉద్రిక్తత ఏర్పడుతుందని వారు తేల్చారు.అరటిపండ్ల నుంచి ఎలుకలు పారిపోతాయని పరిశోధనలో రుజువైనప్పటికీ.. పారిపోయేది మాత్రం మగ ఎలుకలు మాత్రమే అని వారు స్పష్టం చేశారు.
ఎందుకంటే అరటిపండ్లలో ఉండే ఆ కెమికల్ సమ్మేళనం ఆడ ఎలుకల మూత్రం నుంచి వచ్చే వాసన ఓకేలా ఉండటం అని తేల్చారు. మగ ఎలుకల నుంచి తమ పిల్లలను దూరంగా ఉంచడానికి ఆడ ఎలుకలు తమ మూత్రంలో ఒక ప్రత్యేక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తుంటాయి. ఈ రసాయనం మగ ఎలుకలో ఒత్తిడిని సృష్టిస్తుంది. ఆ వాసనను చూసిన వెంటనే మగ ఎలుకలు తీవ్ర ఒత్తిడికి గువుతుంటాయి.. ఆ వాసన వచ్చిన పరిసరాల్లో అస్సలు వల్లకుండా జాగ్రత్త పడుతాయి. అంతే కాదు పారిపోతాయి.అయితే ఆడ ఎలుకలు అరటి పండ్లను అమితంగా ఇష్టపడతాయట. క్యూబెక్లోని మాంట్రియల్లోని మెక్గిల్
యూనివర్సిటీ పరిశోధకులు ఈ అసాధారణ విషయాన్ని కనుగొన్నారు.అధ్యయనం సమయంలో మగ ఎలుకలలో ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. మగ ఎలుకలు
గర్భిణీ లేదా పాలిచ్చే ఆడ ఎలుకలకు దూరంగా ఉంటాయి. ఎందుకంటే
గర్భిణీ ఎలుకల మూత్రంలో ఉండే ఎన్-పెంటైల్ అసిటేట్ వల్ల మగ ఎలుకలు సమస్యలకు గురవుతాయి.
గర్భిణీ లేదా పాలిచ్చే ఎలుక మూత్రం వాసన మగ ఎలుకలలో ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో అవి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ‘సైన్స్ అడ్వాన్స్’ మ్యాగజైన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం
గర్భిణీ లేదా పాలిచ్చే ఎలుకల మూత్రం వాసన అరటిపండు వాసనను పోలివుంటుంది. అందుకే మగ ఎలుకలు అరటిపండ్లను అసహ్యించుకుంటాయి. ఆడ ఎలుకల విషయంలో ఇలా జరగదని అధ్యయనంలో తెలిపారు..