బుల్లి పిట్ట: నోకియా నుంచి 4జి ఫ్లిప్ మొబైల్...!!

Divya
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన నోకియా నుంచి సరికొత్త ఫ్లిప్ మొబైల్స్ విడుదలవ్వడం జరిగింది. ఈ మొబైల్స్ ఆకర్షణీయమైన ఫిచర్లతో కలిగినట్లుగా తెలుస్తోంది. నోకియా 2660 ఫిలిప్స్ స్మార్ట్ మొబైల్ మరియు ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో ఇటీవలే విడుదల చేయడం జరిగింది ఈ 4G ఫిచర్ కలిగిన నోకియా మొబైల్ పాత ఫ్లిప్ డిజైన్ మరియు కొత్త లేటెస్ట్ ఫీచర్లతో అందించడం గమనార్హం. ఇక అంతే కాకుండా నోకియా 2660 స్లిప్ తో పాటు నోకియా 8210-4G క్లాసి మొబైల్ ని కూడా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ఈ మొబైల్ బిగ్ డిస్ప్లే తో రాబోతోంది ఇక ఈ మొబైల్ ధర, స్పేక్స్ మరియు ఫ్యూచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నోకియా 2660 మోడల్ గల మొబైల్ భారత దేశంలో అన్ని రిటైల్ అవుట్ లేట్స్ దగ్గర దొరుకుతుంది. అంతేకాకుండా NOKIA.COM లో మరియు ఈ కామర్ సైట్లలో కూడా ఈ మొబైల్ లభిస్తున్నది. ఈ మొబైల్ నీలం, ఎరుపు,నలుపు రంగులలో మాత్రమే డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మొబైల్ ధర విషయానికి రూ.4699 ధరతో అందుబాటులో ఉండనుంది. ఈ మొబైల్ ఫీచర్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ 2.8 ఇంచుల డిస్ప్లే తో పాటు యూజర్ ఇంటర్ స్పేస్ తో కలిగి ఉంటుంది.
ఇక అంతే కాకుండా మనకి ఏదైనా సమాచారాన్ని కనిపించే విధంగా కూడా పెద్ద డిస్ప్లేని పైన అందించనుందట. ముఖ్యంగా పైన 1.77 అగ్రాల డిస్ప్లే కలదు. ఈ మొబైల్లో అదిరిపోయే బటన్స్ తో పాటు మెసేజ్ టైపింగ్ లో ఎటువంటి తప్పులు లేకుండా చేస్తుంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 1450MAH సామర్థ్యం కలదు. 0.3 మెగా పిక్సెల్ కెమెరాను కూడా నోకియా అందిస్తోంది ఈ మొబైల్లో 4జి డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా చేస్తోంది.4 GB RAM+128 స్టోరేజ్ కూడా కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: