బుల్లి పిట్ట: వన్ ప్లస్ సరికొత్త మొబైల్.. రూ. 15 వేల లోపే..!!

Divya
వన్ ప్లస్ మొబైల్ కొనాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ మొబైల్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ధరలను ప్రకటించడం జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా వన్ ప్లస్ నాలుగు S-20 S మొబైల్ విడుదల చేసింది.5000 MAH బ్యాటరీతో విడుదల చేయడం జరిగింది. ఇక అంతే కాకుండా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో విడుదల చేయడం జరిగింది ఇక ఈ స్మార్ట్ మొబైల్ రెండు కెమెరాలతో అందించడం జరుగుతుంది వీటిలో ముఖ్యంగా 50 మెగా పిక్సెల్ సెన్సార్ ను అందిస్తున్నారు.

ఈ స్మార్ట్ మొబైల్ ధర విషయానికి వస్తే 199 డాలర్లు ఉంటుంది అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.15,800 రూపాయలుగా నిర్ణయించారు. వన్ ప్లస్ నార్డ్ ఎస్ 20 మొబైల్ .. రెండు కలర్లలో లభిస్తుంది దీనికి సంబంధించిన సేల్ ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది మనదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలోనే విడుదల అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా ఈ మొబైల్ పనిచేస్తుంది.12.1 ఆపరేటింగ్ సిస్టంతో వన్ ప్లస్ నార్డ్ ఎస్ 20 ఎస్ కలదు. ఈ మొబైల్ 6.56 అంగుళాల డిస్ప్లే కలదు. ఇక అంతేకాకుండా 2D స్లిమ్ బాడీ తో కూడా ఉండబోతోంది. ప్రధాన కెమెరా తో పాటు సెల్ఫీ ప్రియుల కోసం 2 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. ఈ మొబైల్ 50 శాతం చార్జింగ్ కావడానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే తెలియజేసింది. గతంలో విడుదలైన ఒప్పో A -57 4G మొబైల్ కి రీ బ్రాండెడ్ వర్షన్ తో ఈ మొబైల్ ని విడుదల చేసినట్లుగా తెలియజేశారు. అయితే ఇంకా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: