తక్కువ ధరలో మంచి వాటర్ ప్రూఫ్ ఫోన్లు ఇవే!

ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులతో వచ్చే సమస్యలు ఏంటంటే వాటర్ లో పడితే పాడైపోతాయి.ముఖ్యంగా మొబైల్స్ విషయంలో. అయితే ఇప్పుడు ఆ చింత లేదు.వాటర్ ప్రూఫ్ వాచ్చేస్ ఇంకా క్లాత్స్ , ఇంకా అనేక రకాల వస్తువులతో పాటు వాటర్ ప్రూఫ్ మొబైల్ కూడా వచ్చేసింది. మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఫోన్ నీటిలో పడిపోతే మన ఆనందం వెంటనే ఆవిరైపోతుంది.మన వేల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతాయి. ఇక ఆ తర్వాత ఆ ఫోన్లు ఎందుకూ పనికి రావు. అయితే మార్కెట్‌లో కొన్ని రకాల వాటర్ ప్రూఫ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేసాయి.. పొరపాటున నీటిలో పడినా కూడా వాటిని తీసి ఈజీగా తుడుచుకోవచ్చు.ఆ తర్వాత వాటిని మామూలుగానే వాడుకోవచ్చు. ఇటువంటి ఫోన్లు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.మన భారతదేశ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటర్ ప్రూఫ్ ఫోన్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పోకో ఎం4 ప్రో 5జీ : ఇక ఈ ఫోన్‌ను డస్ట్ ప్రూఫ్ ఇంకా వాటర్ ప్రూఫ్‌గా రూపొందించారు.6.6 ఇంచ్ డిస్ ప్లేతో ఇంకా 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా అలాగే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.4 జీబీ ర్యామ్ ఇంకా 64 జీబీ ఇంటర్నల్ మెమొరీతో ఉండే ప్రారంభ మోడల్ ధర వచ్చేసి రూ.14,215కే లభిస్తోంది.

అలాగే రెడ్‌మీ 10 ప్రైమ్ 2022: 6.5 ఇంచ్ డిస్ ప్లే, 50 రియర్ కెమెరా ఇంకా 8 ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్లు.దీనిని కూడా వాటర్ ప్రూఫ్‌ ఫోన్ గా రూపొందించారు.4జీబీ ర్యామ్ ఇంకా 64 ఇంటర్నల్ మెమొరీతో కూడిన ప్రారంభ మోడల్ ధర వచ్చేసి రూ.11,499గా ఉంది.

ఇంకా ఒప్పో కే 10: వాటర్ ప్రూఫ్ ఫోన్ కొనాలనుకునే వారికి మరో అత్యుత్తమ ఆప్షన్ ఈ మోడల్.6.59 ఇంచ్ డిస్ ప్లేతో, 50 ఎంపీ రియర్ కెమెరా ఇంకా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లభిస్తుంది.6 జీబీ ర్యామ్ ఇంకా 128 జీబీ ఇంటర్నల్ మెమొరీతో కూడిన ప్రారంభ మోడల్ రూ.14,990గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: