వాట్సాప్‌ గురించి ఈ విషయం తప్పక తెలుసుకోవాలి..

Satvika
సోషల్ మీడియాలో అందరు ఎక్కువగా వాడుతున్న యాప్ వాట్సాప్‌..ఇందులో అందరితో ఈజిగా కనెక్ట్ అవ్వడం తో పాటుగా సులువుగా కూడా ఉండటంతో అందరూ ఎక్కువగా ఈ వాట్సాప్‌ను వినియోగిస్తుంటారు.. ఈ యాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. నిత్యం వాట్సాప్‌ చాటింగ్‌లతో మునిగి తేలుతుంటారు.యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్స్‌ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. ఇక వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్‌ చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే వాట్సాప్‌లో పలు ప్రైవసీ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు. అయితే కొన్ని పద్ధతులను అనుసరిస్తే మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో చాలా సులభంగా తెలుసుకోవచ్చు..అవేమిటో ఒకసారి చుద్దాము..

ప్రోఫైల్ ను చూడండి..



కాగా, బ్లాక్‌ చేస్తే ముందుగా ప్రొఫైల్ పిక్చర్ నుంచే తెలుసుకునే అవకాశం ఉంది. మీకు వారి ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తే.. అవతలి వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేయనట్లే. కనిపించకపోతే మాత్రం ఇందులో ఉన్న ఇతర పద్ధతులు కూడా ఫాలో అవ్వండి. ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుకుంటున్నారో.. వారి లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేయడానికి ప్రయత్నించండి. అయితే వాళ్లు లాస్ట్ సీన్ డిజేబుల్ చేస్తే బ్లాక్ చేయకపోయినా కనిపించదు. ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించకపోతే కచ్చితంగా బ్లాక్ చేసినట్లే..


ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేస్తే మీరు చేసిన మెసేజ్ కు ఒక టిక్ మార్కు మాత్రమే వస్తుంది.మెసేజ్ పెట్టి ఎంత సేపయినా ఈ టిక్స్ రాకపోతే మిమ్మల్ని దాదాపు బ్లాక్ చేసినట్లేనని గుర్తించాలి. అంతేకాకుండా మిమ్మల్ని బ్లాక్ చేసినవారికి మీరు కాల్ చేస్తే ఆ కాల్ అవతలివారికి వెళ్లదు. అక్కడ మీకు రింగింగ్ బదులు కాలింగ్ అని మాత్రమే వస్తుంది. అయితే అవతలివాళ్లు ఇంటర్నెట్ ఆపినా కాలింగ్ అనే వస్తుంది. వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. వారితో మీరు గ్రూప్ క్రియేట్ చేయడం కూడా కుదరదు. అందుకే ఎవరైతే బ్లాక్ చేశారని మీరు అనుకుంటున్నారో వారితో గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. అయితే అవతలివాళ్లు ప్రొఫైల్ పిక్చర్ డిలీట్ చేసి, లాస్ట్ సీన్ హైడ్ చేసి, నెట్ ఆఫ్ చేసినా పైవన్నీ జరుగుతాయి.. ఇవన్నీ జరగ కుంటే మిమ్మల్ని దాదాపు బ్లాక్ చేసినట్లే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: