చిన్న ట్రాక్టర్.. బోలెడు ప్రయోజనాలు..

Satvika
పెద్ద పెద్ద వస్తువులు అన్నీ ఒక చిన్న స్మార్ట్ ఫోన్ లో అర చేతిలో కనిపిస్తున్నాయి.. అలానే చిన్న వస్తవులు పెద్దగా ఒక మైక్రొస్కొప్ లో కనిపిస్తాయి.అందుకే సైన్స్ జెట్ స్పీడ్ లో పరుగులు పెడుతోంది..ఈ క్రమంలో కొత్త కొత్త వాటిని అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.ఇప్పటికే ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీ తో కలిగిన వాహానాలు అందుబాటులోకి వచ్చింది.  ఇప్పుడు మరో వాహనం అందుబాటులోకి వచ్చింది.అతి తక్కువ ఎత్తులో వుండే సూపర్ టెక్నాలజీ తో వుండే ఒక ట్రాక్టర్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చాడు ఓ ఇంటర్ విద్యార్థి.

 
ఈరోజు పిల్లలు ఎం తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు అనడంలో ఇది నిదర్శనం..ఆ చిన్న ట్రాక్టర్ చేస్తున్న వాటిని చూస్తె ఎవరికైనా షాక్ అవ్వాల్సిందె..ఇక ఆలస్యం ఎందుకు ఆ ట్రాక్టర్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..పంజాబ్కు చెందిన ఓ యువకుడు రూపొందించిన అతి చిన్న ట్రాక్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్నప్పటి నుంచి ట్రాక్టర్లు అంటే అమితమైన ఆసక్తి ఉన్న గుర్విందర్ అనే ఇంటర్ విద్యార్థి మూడు అడుగుల ట్రాక్టర్ను తయారు చేశాడు.

పంజాబ్‌లో ఓ ఇంటర్‌ విద్యార్థి అతి చిన్న ట్రాక్టర్‌ను రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. బఠిండాలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన గుర్విందర్‌ అనే యువకుడు మూడు అడుగుల ఎత్తు ఉన్న ట్రాక్టర్‌ను తయారు చేశాడు. అనంతరం సాధారణ ట్రాక్టర్‌ వలే దాన్ని నడిపి స్థానికుల మన్ననలను పొందాడు. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న గుర్విందర్‌కు చిన్నప్పటి నుంచి ట్రాక్టర్లు అంటే అమితమైన ఆసక్తి. ఆ ఇష్టంతోనే చిన్న చిన్న మోటర్లను ఉపయోగించి ఇప్పటికే చాలా ట్రాక్టర్లను తయారు చేసినట్లు తెలిపారు. తన ఆసక్తి అందరినీ ఆకర్షించింది.కేవలం రూ.40 వేలతో ఈ ట్రాక్టర్ను తయారు చేశాను. నేను రూపొందించిన ట్రాక్టర్ లీటరుకు 35 కి.మీ మైలేజీ ఇస్తుంది. 4 క్వింటాళ్ల వరకు బరువును మోయగలదు. ట్రాక్టర్‌పై బయటకు వెళ్లినప్పుడు చాలా మంది ఫొటోలు దిగుతున్నారు..అంటూ అతను గర్వాంగా చెప్పుకున్నాడు.. మొత్తానికి అతడి ఆలోచన అందరినీ ఆకర్షించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: