గూగుల్ ఫొటోస్ నుంచి కొత్త ఫీచర్.. ఇక డైరెక్ట్ గా..!!

నిజానికి ఆల్బమ్ నుంచి నేరుగా ఫొటోలను డిలీట్ చేసే ఫెసిలిటీ గూగుల్ ఫొటోస్‌ వెబ్ వెర్షన్‌ (Web Version)లో చాలా సంవత్సరాల క్రితమే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యూజర్లకు ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రావడంతో ఫొటోలు ఇంకా వీడియోలు డిలీట్ చేయడం మరింత ఈజీగా మారింది. ఇక ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్ ప్రైవేట్ ఆల్బమ్‌ల్లోని ఫొటోలు లేదా వీడియోలు డిలీట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక షేర్డ్ ఆల్బమ్‌ (Shared Album)ల్లోని మీడియాని డైరెక్ట్‌గా డిలీట్ చేయడం కుదరదు. ఇక గూగుల్ ఫొటోస్ యూజర్లు 'మూవ్ టు ట్రాష్ (Move To Trash)' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆల్బమ్‌లలోని మీడియాను తొలగించవచ్చు. ఇక ఈ అప్‌డేట్‌కు ముందు, ఇంకా ఆల్బమ్ నుంచి మాత్రమే మీడియాను తీసివేయడం సాధ్యమయ్యేది. అలాగే సేవ్డ్ మీడియా (Saved Media) నుంచి దాన్ని తొలగించడానికి, మెయిన్ ఫీడ్ లో మీడియాను సెర్చ్ చేసి దాన్ని డిలీట్ చేయాల్సి వచ్చేది.


ఇక ఈ ప్రాసెస్ చాలా సమయంతో కూడుకున్నది. ఆండ్రాయిడ్‌లో షేర్డ్ ఆల్బమ్‌ల విషయంలో మీడియా డిలీట్ చేసే ప్రాసెస్ ఇప్పటికీ కూడా యథాతథంగా ఉంటుంది.అయితే యాప్ ఐఓఎస్ వెర్షన్ యూజర్లు మాత్రం షేర్డ్ ఆల్బమ్‌లో స్టోర్ చేసిన ఫొటోలను నేరుగా ట్రాష్‌ (Trash)కి ఈజీగా మూవ్ చేయవచ్చు. ఇక ఈ ఫెసిలిటీని గూగుల్ తన స్వంత ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌కు ఇవ్వకుండా ఐఓఎస్‌కి మాత్రమే ఇవ్వడం అనేది గమనార్హం. టెక్ దిగ్గజం ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ రెండింటిలో గూగుల్ ఫొటోస్‌ యాప్‌ను ఎప్పుడు సమానంగా మారుస్తుందో చూడాలి.ఇక మీడియా బ్రౌజ్ చేస్తున్నప్పుడు డేట్ ఇంకా లొకేషన్ చూపించే కొత్త ఇండికేటర్ కూడా గూగుల్ ఈమధ్య లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌తో గూగుల్ ఫొటోస్‌లో టాప్ లెఫ్ట్ కార్నర్‌లో మీడియాకి సంబంధించిన డేట్‌ ఇంకా అలాగే లొకేషన్ ని కూడా మీరు వీక్షించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: