ఈ ట్రిక్ తో అవతలి వ్యక్తి కాల్ రికార్డ్ చేసాడో లేదో తెలుసుకోవచ్చు!

స్మార్ట్ ఫోన్లతో టెక్నాలజీ వినియోగం సామాన్యుల చెంతకు కూడా బాగా దగ్గరికి వచ్చింది.అయితే దీనివల్ల ఎన్ని ప్రయోనాలు ఎన్ని ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా అదే మొత్తంలో జరుగుతున్నాయన్నది వాస్తవం. ముఖ్యంకా కాల్ రికార్డింగ్ అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ఎదుటి వారికి తెలియకుండా వారి కాల్ రికార్డింగ్ చేసి బాగా ఇబ్బందులు పెట్టిన సంఘటనలు అనేకం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, వ్యక్తుల గోప్యత ఇంకా భద్రతను రక్షించడానికి google థార్డ్ పార్టీ యాప్ ల ద్వారా కాల్ రికార్డింగ్‌ను నిషేధించింది.అయితే.. డిఫాల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో Android ఫోన్‌లు ఇప్పటికీ కాల్‌లను ఈజీగా రికార్డ్ చేయగలవు. ఇక ఈ నేపథ్యంలో ఎదుటి వారు మీ కాల్ ను రికార్డ్ చేస్తున్నారా? లేదా? అన్న ప్రశ్న అందరిలో.. చాలా సార్లు వ్యక్తం అవుతూనే ఉంటుంది. మీ కాల్ రికార్డ్ చేయబడిందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ చాలా ఈజీ ట్రిక్స్ ఉన్నాయి.మీరు మీ కాల్ రికార్డింగ్‌లను ట్రాక్ చేయడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. 


మీకు కాల్ వచ్చినప్పుడు లేదా మీరు ఎవరికైనా కానీ కాల్ చేసినప్పుడు గాని ఖచ్చితంగా కొన్ని విషయాలపై శ్రద్ధ వహించండి. ఇక మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవే..ఇక డిఫాల్ట్ ఫీచర్‌ని ఉపయోగించి కాల్‌ను రికార్డ్ చేస్తున్నప్పుడు, ఆ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో బీప్ శబ్ధం అనేది పునరావృతమవుతుంది. కాబట్టి, కాల్ సమయంలో బీప్ మళ్లీ మళ్లీ మీకు వినిపించినప్పుడు, మీ కాల్ రికార్డు చేయబడుతుందని అర్థం చేసుకుని జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది.ఇక ఎదుటి వ్యక్తి మీ ఫోన్ లిఫ్ట్ చేయగా.. బీప్ శబ్దం గనుక వినిపిస్తే.. అది ఖచ్చితంగా కాల్ రికార్డింగ్‌కు సూచన. అనేక స్మార్ట్ ఫోన్లలో కాల్స్ లిఫ్ట్ చేయడంతోనే బీప్ వినిపించేలా ఓ సెట్టింగ్ ఉంటుంది. అలా బీప్ కనుక వినిపిస్తే కాల్ రికార్డ్ చేయబడుతుందని భావించవచ్చు.అలాగే కొన్ని ఫోన్లలో రికార్డ్ ఆప్షన్ పెట్టుకుంటే ఎదుటు వారు ఫోన్ లిఫ్ట్ చేయగానే మీ కాల్ అనేది రికార్డ్ చేయబడుతుంది అని వాయిస్ మెసేజ్ వారికి వినిపిస్తుంది. మీకు అలా వినిపస్తే ఖచ్చితంగా అలర్ట్ అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: