బుల్లిపిట్ట: ఈ బ్యాటరీ వల్ల..6 నెల వరకు కంప్యూటర్ నాన్ స్టాప్ రన్నింగ్ చేయవచ్చు..!!

Divya
ఇక్కడ చూపించిన ఫోటోలో కూలర్ బాక్స్ లాగా కనిపించే వస్తువు ఏంటో మీకు తెలుసా.. ఈ బాక్స్ యొక్క అసలు విషయం తెలిస్తే.. ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. అదేమిటంటే ఇది ఒక బ్యాటరీ.. ఆరు నెలల పాటు కరెంటు ఇచ్చే విధంగా విధిని శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. కేమ్ బ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ ప్రాసెసర్ ఈ బ్యాటరీని కనెక్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాటరీ వల్ల ఆరు నెలల పాటు నిరంతరాయంగా కంప్యూటర్ పని చేస్తుందట. ఈ బ్యాటరీ సెల్ AA బ్యాటరీ కంటే చాలా చిన్నది కావడం గమనార్హం.

పరిశోధకులు బ్లూ , గ్రీన్ , ఆల్గే ను ఎలక్ట్రో కోడ్ ల తో కూడిన కంటైనర్ తో ఉంచారు. దీనికి విద్యుత్ ఉత్పత్తి అయ్యే దానికి సూర్యరశ్మిని ఉపయోగిస్తారట. ఈ బ్యాటరీ కంప్యూటర్ నడపడానికి తగినంత శక్తిని కూడా అమర్చి ఉంటుంది. అలాగే కంప్యూటర్లను ఆరు నెలల పాటు నిరంతరంగా నడిపిస్తూనే ఉంటుంది. జర్నల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ ప్రకారం, సైనో బ్యాక్టీరియా ద్వారా కంప్యూటర్ 45 సైకిల్స్ లో అమలు చేసేందుకు అనుమతి తీసుకున్నారు.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ పోలె తెలియజేయునది ఏమనగా ఈ సిస్టం చాలా కాలం పాటు పని చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది . ఇది కొన్ని వారాల తరువాత ఆగిపోవచ్చు భావించామని కానీ అది కొనసాగుతూనే ఉంటుందని తెలియజేశారు. ఆరు నెలల పాటు అంతరాయం లేకుండా నడిచిన ఈ కంప్యూటర్ 0.3 మైక్రో వార్త శక్తి పనిలేకుండా నడుస్తోంది అని తెలియజేశారు. అయితే ఇది పూర్తిగా ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలియలేదు. కానీ కిరణజన్యసంయోగక్రియ ద్వారా దీనిని కనుగొన్నామని తెలియజేశారు. వెలుతురు లేకపోవడంతో విద్యుత్ పై తీవ్రంగా ప్రభావం చూపలేదని.. పగలు రాత్రి సమయాలలో ఇది ఎల్లప్పుడూ అయినా స్థిరంగానే పని చేస్తోందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: