బుల్లిపిట్ట: రూ.6 వేలకే డబుల్ డోర్ ఫ్రిడ్జ్.. పూర్తి వివరాలు ఇదిగో..!!

Divya
ఈ కామర్స్ ప్రముఖ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్ కార్ట్ సరి కొత్త ఆఫర్లను అందిస్తూ వినియోగదారులను బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ వస్తోంది. తాజాగా సూపర్ కూలింగ్ డేస్ ను ప్రకటించి అందులో కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను ఆఫర్ కింద ప్రకటించి ఈనెల 25వ తేదీ వరకు ఈ ఆఫర్లను కొనసాగించే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ముఖ్యంగా రిఫ్రిజిరేటర్లు, స్ప్లిట్ మరియు విండో ఏసీ ల పైన కూడా భారీ తగ్గింపు ధరలతో అందించనుంది. అయితే ఎవరైనా కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలనుకునేవారికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు..
ఈ సేల్ లో మీరు godrej 236 L శ్రేష్ఠత డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ అతి తక్కువ ధరలకే తీసుకోవచ్చు.. దీని అసలు ధర రూ.21,900 రూపాయలు కాగా కానీ ఈ రిఫ్రిజిరేటర్ పై ఫ్లిప్కార్ట్ లో 9 శాతం డిస్కౌంట్ కూడా అందిస్తోంది. దీంతో ఎవరైనా సరే రూ.19,790 రూపాయలకే ఈ రిఫ్రిజిరేటర్ ని కొనుగోలు చేయవచ్చు. ఇక వీటితో పాటుగా అనేక ఆఫర్లు ఈ రిఫ్రిజిరేటర్ పై అందుబాటులో ఉన్నవి.
మీరు గోద్రెజ్ 236L ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ను కొనుగోలు చేస్తే..SBI బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే .. రూ.1,750 తగ్గుతుంది. ఇక అంతే కాకుండా ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ పై.. రూ.12,000 ఎక్సేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. మీరు పాత ఫ్రిడ్జ్లు మార్చుకుంటే మీకు ఈ రిఫ్రిజిరేటర్ రూ.12,000 రూపాయలకు లభిస్తుంది. మీ ఫ్రిడ్జ్ మోడల్ కండిషన్ ఆధారంగా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ మీకు పూర్తిగా అప్లై అయితే కేవలం.. రూ.6,400 రూపాయలకే ఎటొచ్చి మనం సొంతం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఫ్లిప్ కార్ట్ లో ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లు రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఫ్లిప్ కార్ట్ నే ఉపయోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: