బుల్లిపిట్ట: కేవలం సూట్ కేసులో పట్టే బైక్..!!

Divya
గత కొన్నాళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువగా ట్రెండీ గా మారాయి.. ప్రజలు క్లీన్ అండ్ గ్రీన్ మొబిలిటీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. స్కూటర్ లలో ఎక్కువగా పెట్రోల్, కరెంట్ చార్జింగ్ చేస్తేనే బైక్ ముందుకు వెళ్తుంది.. కానీ ఇప్పుడు చెప్ప పోయే బైక్ కి కేవలం పార్కింగ్ ప్లేస్ కూడా అవసరం ఉండదట. అలా కనిపెట్టారు ఈ బైకు ని. అయితే ఆ స్కూటర్ పేరు ఏమిటంటే..POIMO. ఈ స్కూటర్ కోసం మనం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు. కేవలం ఒక బ్యాగ్ లో మడుచుకోవచ్చు. రోబోటిక్స్, ఎలక్ట్రిక్ పర్సనల్ మొబిలిటీ.. వారు ఈ బైక్ ను  సంయుక్తంగా తయారు చేశారు. అయితే ఈ బైక్ యొక్క ప్రత్యేకతలను తెలుసుకుందాం.

Poimo నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 5.5 కిలోల బరువు కలదు.. ఇందులో సాఫ్ట్ రోబోటిక్ టెక్నాలజీని కూడా ఉపయోగించడం జరిగింది. దీనివలన ఈ బైక్ సురక్షితంగా, తేలికగా వుంటుంది. ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే  ప్రయాణం చేయగలరు. మొత్తం స్కూటర్ బరువును తగ్గించుకునేందుకు కంపెనీ వారు దీనిని వైర్లెస్ పవర్ సిస్టం ను కూడా అందించారు. దీంతో ఆ స్కూటర్ పై కూర్చున్న వ్యక్తి ఈ బైక్ ను చాలా సులభంగా నడపగలరు.
దీని బాడీని థర్మోప్లాస్టిక్ పాలియురేతే న్ తో తయారు చేయబడింది. ఎయిర్ బెడ్ ను ఉపయోగించే ఆప్షన్ కూడా ఇందులో ఉన్నది. ఇది ముందు వెనుక చక్రాలు, ఎలక్ట్రిక్ బ్యాటరీ, మోటారు, హ్యాండిల్ బార్ వైర్లెస్ కంట్రోల్ ను అందించడం జరుగుతోంది. కంపెనీ సమాచారం ప్రకారం ఈ స్కూటర్ తయారు చేసేందుకు 5 నిమిషాల సమయం పడుతుంది. స్కూటర్ నడపడానికి ఇందులో కేవలం గాలి ని నింపాలి. ఆ తర్వాత బైక్ సిద్ధమవుతోంది దీని వెనుక భాగంలో వాళ్ళు ఉండడం వల్ల దీనిని నుంచి గాలి తీసేయవచ్చు. ఆ తర్వాత ఎంచక్క మీ బ్యాగ్ లో ఈ బైకు ని ఉంచుకోవచ్చు. అయితే ఇది ఇంకా మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. త్వరలో రాబోతున్నట్లు కంపెనీ తెలియజేసింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: