బుల్లిపిట్ట: అదిరిపోయే ఫీచర్స్ తో సాంసంగ్ నుంచి స్మార్ట్ ఫోన్ విడుదల..!!

Divya
టెక్నాలజీకి అనుగుణంగా వినియోగదారులు కూడా సరికొత్త ఫీచర్లతో అలవాటు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మొబైల్ కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తూ కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ కూడా తన సరికొత్త మోడల్ ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. సాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 FE మోడల్ తాజాగా మార్కెట్లో విడుదల చేసి సరికొత్త ఫీచర్లతో కస్టమర్లకు ఆనందాన్ని కలగజేస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ ఈ .. 2022 పేరుతో సరికొత్త మోడల్ ను  దక్షిణకొరియా లో ఎటువంటి ఆడంబరాలు లేకుండా చాలా సైలెంట్ గా మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. 2020 లో ప్రారంభించిన గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ ఈ మోడల్ ను  ఈ కొత్త మొబైల్ పోలి ఉంటుంది. ఇక ధర కూడా పాత మోడల్ తో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఇక ఈ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. 120 Hz సూపర్ AMOLED డిస్ప్లేతో చాలా ఆకర్షణీయంగా ఈ మొబైల్ కనిపించడం గమనార్హం. ఇక స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో  మూడు కెమెరాలను అమర్చారు. బ్యాటరీ విషయానికి వస్తే 4500 ఎమ్ ఏ హెచ్ తో రూపొందించడం జరిగింది.
ఇక ఈ మోడల్ భారత మార్కెట్లో ఎప్పుడు విడుదల చేయనున్నారు ఇంకా సాంసంగ్ ప్రకటించకపోవడం గమనార్హం. స్టోరేజ్ విషయానికి వస్తే.. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర కొరియన్ కరెన్సీలో 699,600 KRW. ఇక భారత కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.43,500 అన్నమాట. గత మోడల్ సాంసంగ్ గెలాక్సీ  S20 FE 2020 వేరియంట్ ధర కంటే ఈ మోడల్  తక్కువ ధరకు లభించడం గమనార్హం. కొరియన్ కరెన్సీలో గత మోడల్‌తో పోల్చుకుంటే 200,000 KRW తక్కువ. అంతే భారత కరెన్సీలో దాదాపు 12,400 రూపాయలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: