బుల్లిపిట్ట: మీ మొబైల్ నుంచే వైఫై కాలింగ్..ఎలా ఆక్టివేట్ చేయాలంటే..?

Divya
మారుతున్న కాలం కొద్ది టెక్నాలజీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతోంది.. ఒకప్పుడు స్మార్ట్ మొబైల్స్ పెద్దగా ఫీచర్స్ లేకున్నా కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉండేవారు. ఇక టెక్నాలజీ తో పాటుగా సరి కొత్త ఫీచర్లను ఇప్పుడు గురించి మరికొన్ని స్మార్ట్ మొబైల్ లను తయారుచేస్తున్నాయి సంస్థలు. ప్రస్తుతం ఇప్పుడున్న మొబైల్స్ కి ఎక్కువగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి అందులో ముఖ్యంగా వాయిస్ వినిపించకపోవడం.. మధ్య మధ్యలో మొబైల్ హాంగ్ అవుతూ ఉంటాయి. ఇలా రకరకాలుగా సమస్యలు ఎదురవుతూనే.. ఇక మొబైల్ నెట్వర్కింగ్ కనెక్టివిటీ చాలా తక్కువ ఉన్న సమయంలో ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయని చెప్పవచ్చు.
రెగ్యులర్ ఫోన్ కాల్ చేయడం లో వైఫై కాలింగ్ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. భారత్లో ఎయిర్టెల్, జీవో తో పాటుగా మరికొన్ని సంస్థలు కూడా వైఫై కాలింగ్ సదుపాయాన్ని ఫ్రీ గానే యూజర్లకు అందిస్తున్నాయి. మరి వైఫై కాలింగ్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ముందుగా సెట్టింగ్ మెనూ కు వెళ్లాలి.. ఆ తరువాత నెట్వర్కింగ్ ఆప్షన్ పైన ఓపెన్ చేయవలసి ఉంటుంది. అందులో ఆండ్రాయిడ్ ఫోన్లో నెట్వర్క్ కి బదులుగా మొబైల్ నెట్వర్కింగ్ కనెక్షన్ చేయవలసి ఉంటుంది.
2). నెట్వర్క్ కనెక్షన్ కి వెళ్ళిన తర్వాత..WIFI ఆప్షన్ ను ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అడ్వాన్సు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
3). వైఫై కాలింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వచ్చిన తర్వాత మీ మొబైల్ లో రెండు సిమ్ కార్డులు ఉంటే అందులో నుండి ఒక సిమ్ ద్వారా వైఫై కాలింగ్ ఫ్యూచర్ ని ఉపయోగించుకోవచ్చు.
ఐఫోన్ ఫోన్ యూజర్స్ సెట్టింగ్స్:
1). మొబైల్ డేటా పైన క్లిక్ చేసి ఆ తర్వాత వైఫై కాలింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ ఆప్షన్ ను మీ మొబైల్ సపోర్ట్ చేస్తేనే ఇలాంటి ఫ్యూచర్ వర్క్ అవుతుందట.
2). వైఫై కాలింగ్ ఆన్ ది ఐఫోన్ ఫ్యూచర్.. అనే ఆప్షన్ ని ఆన్ చేయాలి. ఈ ఫీచర్ ఆన్ చేశాక మీ మొబైల్ లో స్టేటస్ బార్ లో టెలికామ్ ఆపరేటర్స్ వైఫై అనే ఆప్షన్ ఆన్ చేసుకోవాలి.
3).ఇక అటు తర్వాత సిగ్నల్ ఉన్న ప్రాంతాలలో మీ వైఫై ద్వారా రెగ్యులర్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: