క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జాగ్రత్త?

praveen
ఈ మధ్యకాలంలో ఏది కావాలన్నా కూడా ఆన్లైన్లో దొరుకుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కావాల్సింది కొనుక్కోవడానికి చెల్లింపులు కూడా ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయ్ ఇటీవల కాలంలో.  నగదు రహిత లావాదేవీలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక ప్రస్తుతం చిన్న బడ్డీ కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ప్రతి ఒక్కరు కూడా తమ అకౌంట్ కు లింకు ఉన్న క్యూఆర్ కోడ్ చూపించడం.. ఇక ఆ క్యూఆర్ కోడ్ ని  స్కాన్ చేసి అక్కడికి వచ్చిన కస్టమర్లు డబ్బులు పంపించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇలా డబ్బులు పంపించడం వల్ల నేరుగా అకౌంట్ లోకి చేరుతుండడంతో అందరూ ఇలాంటి ఫెసిలిటీ ని వాడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇలా ఆన్లైన్లో చెల్లింపులు చేయడం వల్ల క్యాష్బ్యాక్ సహా మరికొన్ని రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. కేవలం ప్రయోజనాలకు మాత్రమే కాదు ఆన్లైన్ పేమెంట్ కారణంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చివరికి అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అంతలా సైబర్ నేరగాళ్లు సమయం కోసం కాచుకుని చూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడం డబ్బులు పంపించడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కాని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బిఐ తమ కస్టమర్లకు అభ్యర్థిస్తూ ఉండడం గమనార్హం.

 డబ్బులు పొందడం కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయొద్దని కస్టమర్లను హెచ్చరించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్యూ ఆర్ కోడ్ తో డబ్బులు చెల్లిస్తామని పొందడం కోసం కాదని క్యూఆర్ కోడ్ అనేది క్విక్ రెస్పాన్స్ కోడ్. ఇక పాయింట్ ఆఫ్ సేల్ వద్ద మొబైల్ పేమెంట్ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి పేమెంట్ చేసే ముందు ప్రతి ఒక్కరు ఎంత అలర్ట్ గా ఉండాలని సూచించింది. తెలియని ధ్రువీకరణ లేని క్యూఆర్ కోడ్  లు స్కానింగ్ చేయవద్దు అంటూ హెచ్చరిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: