ఈ రోజుల్లో సైబర్ సెక్యూరిటీ అనేది తప్పనిసరి, ముఖ్యంగా ఈ కాలంలో ప్రపంచంలో సగానికిపైగా వ్యక్తుల లావాదేవీలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. హ్యాకర్లు ఎల్లప్పుడూ తమ టార్గెట్ల కోసం వెతుకుతూ ఉంటారు. ఇక ఇప్పుడు, NordVPNలోని ఒక కొత్త నివేదిక ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..కంప్యూటర్‌ను ఉపయోగించి, సగటు చెల్లింపు కార్డును కేవలం ఆరు సెకన్లలో హ్యాక్ చేయవచ్చు. గ్లోబల్ VPN సర్వీస్ ప్రొవైడర్ 140 దేశాల నుండి నాలుగు మిలియన్ల పేమెంట్ కార్డులను విశ్లేషించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. ఇంకా పేమెంట్ కార్డ్‌ను హ్యాక్ చేయడానికి 'బ్రూట్ ఫోర్స్' అత్యంత సాధారణ పద్ధతి అని కనుగొన్నారు.NordVPN చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారిజస్ బ్రీడిస్ మాట్లాడుతూ, "డార్క్ వెబ్‌లో ఇంత భారీ సంఖ్యలో పేమెంట్ కార్డ్‌లు కనిపించడానికి ఏకైక మార్గం బ్రూట్-ఫోర్సింగ్. అంటే నేరస్థులు కార్డ్ నంబర్ ఇంకా CVVని తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. కంప్యూటర్‌ని ఉపయోగించి, ఇలాంటి దాడికి ఆరు సెకన్లు మాత్రమే పట్టవచ్చు." అని అన్నారు.
ఇక మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ హ్యాక్ కాకుండా ఎలా నిరోధించవచ్చు ఏదైనా అనుమానాస్పదంగా కనుక అనిపిస్తే ఖచ్చితంగా వినియోగదారులు వారి నెలవారీ స్టేట్‌మెంట్‌లను చెక్ చేసుకోవాలి.వినియోగదారులు బ్యాంక్ నుండి సేఫ్టీ నోటిఫికేషన్‌ను స్వీకరించినట్లయితే వారు వెంటనే రియాక్ట్ అవ్వాలి. వివిధ ప్రయోజనాల కోసం స్పెషల్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండండి. మీరు పేమెంట్ కార్డ్‌లు కనెక్ట్ చేయబడిన అకౌంట్ లో చాలా తక్కువ డబ్బును మాత్రమే ఉంచండి. "కొన్ని బ్యాంకులు మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు సురక్షితంగా లేకుంటే మీరు ఉపయోగించగల తాత్కాలిక వర్చువల్ కార్డ్‌లను కూడా అందిస్తాయి" అని బ్రీడిస్ చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్‌లో, bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మోసపూరిత కార్యకలాపాలు పెరగకుండా ప్రజలను హెచ్చరించింది.KYC అప్‌డేషన్ పేరుతో జరిగే మోసాలకు వ్యతిరేకంగా RBI హెచ్చరిస్తుంది.